Site icon NTV Telugu

HBD MS Dhoni: ఇందుకే కదయ్యా నిన్ను మిస్టర్ కూల్ అనేది.. ఇంట్లోనే పుట్టినరోజు వేడుకలు.. వీడియో వైరల్

Msd

Msd

HBD MS Dhoni: ఎమ్ఎస్ ధోని.. ప్రపంచ క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు. మహేంద్ర సింగ్ ధోనిగా క్రికెట్ కు పరిచయమై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నాడు. ఇండియన్ టీంలోకి వికెట్ కీపర్ బ్యాటెర్ గా వచ్చిన ధోని. కెరీర్ ముగిసే సమయానికి ప్రపంచంలోనే “ది బెస్ట్ ఫినిషర్” గా మారిపోయాడు. లక్ష్యం ఎంత వున్నా, ధోనికి బౌలింగ్ చేయాలంటే, బౌలర్లందరూ భయపడేవారు. ఇలా ఇప్పటికి ఐపీఎల్ ఆడుతున్న ఈ మిస్టర్ కూల్ కి బర్త్ డే విషెస్ చెప్పారా మీరు.. ఆలస్యమెందుకు మీరు కూడా విషెస్ చెప్పండి.

Read Also:Dangerous Stunt: ఎవర్రా మీరంతా.. రీల్స్ కోసం ప్రాణాలను ఇలా పణంగా పెట్టాలా..?

ఇక ఎమ్ఎస్ ధోని, తాజాగా తన బర్త్డే వేడుకలను తన ఫ్రెండ్స్ తో కలిపి జరుపుకున్నాడు. జార్ఖండ్ లోని తన స్నేహితుడి ఇంట్లో MS ధోని, తన 44 పుట్టిన రోజు సందర్భంగా ఫ్రెండ్స్ తో కలిసి కేక్ కట్ చేశాడు. అయితే ధోని ఎప్పుడూ వేడుకలకు దూరంగా సింపుల్ గానే ఉంటాడు. కాగా అభిమానులందరూ ధోనీని, కెప్టెన్ కూల్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇదిలా ఉండగా.. 2004 లో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టిన ధోని, ఆ తర్వాత వెనక్కు తిరిగి చూసుకోలేదు. టీమిండియా కెప్టెన్ గా ఎంపికైన తరువాత దాదాపు అన్ని ఫార్మాట్లలోనూ కప్ లు అందించాడు.

Read Also:Suicide : “నీ కొడుకు తలరాత ఇలానే రాస్తావా.?” సూసైడ్ నోట్‌లో దేవుడిపై యువకుడు

2007లో టీ20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్ అలాగే 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను టీమిండియాకు అందించాడు. ఇక ఐపీఎల్లోనూ తన మార్క్ చూపించాడు. ఐపీఎల్ మొదటి నుండి చెన్నై సూపర్ కింగ్స్ కి కెప్టెన్ గా వున్న ధోని, తన టీంను 5 సార్లు ఛాంపియన్స్ గా నిలబెట్టాడు. ఇలా తన కెప్టెన్సీలో ఎవరికీ సాధ్యం కానీ రికార్డులు సెట్ చేసాడు. ఇక మ్యాచ్ లలో తాను తీసుకునే నిర్ణయాలు అయితే ఇప్పటికి ఎవరు డీకోడ్ చేయలేకపోయారు. దీంతో పాటు ఇప్పుడు ప్రపంచంలోనే గొప్ప ఫినిషర్ గా వున్నాడు. అయితే ఎప్పుడూ ఆడంబరాలకు దూరంగా వుండే ధోని.. ఇప్పుడు కూడా తన బర్త్డే సెలెబ్రేషన్స్ ను చాలా సింపుల్ గా ఫ్రెండ్స్ తో కలిసి కేక్ కట్ చేసి జరుపుకున్నాడు.

Exit mobile version