Site icon NTV Telugu

Viral Wedding Reception: కోనసీమలో పెళ్లంటే మాములుగా ఉండదు.. ట్రెండ్ సెట్ చేస్తున్న కొత్త జంట

Marraige

Marraige

పెళ్లంటే ఓ సందడి వాతావరణం ఉంటుంది. పెళ్లింట్లో బంధువులు, ఫ్రెండ్స్, పిల్లలు, పెద్దలతో కోలాహలంగా మారుతుంది. రెండ్రోజులు ముందుగానే సందడి సందడిగా ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోతారు. మంగళస్నానం దగ్గరి నుంచి పెళ్లి అయిపోయేంత వరకు ఓ పండగలా జరుగుతుంది. అయితే పెళ్లి రోజు మాత్రం వెరీ స్పెషల్. తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో వధువరులు ఒక్కటవుతారు. ఆ తర్వాత రిసెప్షన్ కార్యక్రమం ఉంటుంది. అందులో వధువరులిద్దరూ ఫొటోలు దిగడం, వీడియోలు తీసుకుని వారి మెమోరీస్ ను గుర్తించుకుంటారు. అయితే ఓ పెళ్లిలో రిసెప్షన్ కు వెళ్లడానికి ఊరేగింపు కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఎలా అంటే..!

Read Also: Extramarital Affair: భర్త రాసలీలలు.. అరగుండు గీసి ఊరేగించిన భార్య..

పెళ్లిళ్లలో కోనసీమకు ఒక ప్రత్యేకత ఉంటుంది. పెళ్లికి ముందు కానీ, పెళ్లి తర్వాత కానీ అల్లుళ్లకు గ్రాండ్ గా వంటకాలు చేసి పెట్టిన సంఘటనలు విన్నాం, చూశాం. కానీ ఇప్పుడు సుఖేష్, శ్రీ రంగనాయకి అనే కొత్త జంట ట్రెండ్ సెట్ చేస్తుంది. రాజోలులో వధూవరులిద్దరూ వెడ్డింగ్ రిసెప్షన్ కు తీసుకెళ్తుండగా భారీ ఊరేగింపును ఏర్పాటు చేశారు.

Read Also: Health Tips: మహిళలకు అరికాళ్లల్లో ఎందుకు నొప్పి వస్తుందో తెలుసా?

కారులో కూర్చున్న ఈ జంట చుట్టూ బౌన్సర్లు, బుల్లెట్ బైకులపై మహిళలు పైలట్ గా తీసుకెళ్తున్నారు. డప్పు, వాయిద్యాల మధ్య బాణాసంచా పేల్చూతూ ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా ముందు, వెనుకాల భారీగా జనాలు నడుచుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఈ నూతన జంటకు సంబంధించిన ఊరేగింపు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఊరేగింపును చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు నెటిజన్లు ఊరేగింపును ఇంత గ్రాండ్ గా జరుపుకుంటారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎంతైనా కోనసీమలో పెళ్లంటే మాములుగా ఉండదని అంటున్నారు.

Exit mobile version