NTV Telugu Site icon

Viral Video: రజత పతకం విజేత నీరజ్ చోప్రా లగ్జరీ ఇల్లు చూశారా? షాక్ అవ్వాల్సిందే..!

Twitter

Twitter

పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో భారత స్టార్‌ అథ్లెట్‌, గోల్డెన్ బాయ్ నీరజ్‌ చోప్రా రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. జావెలిన్‌ త్రో ఫైనల్‌లో నీరజ్‌ తన రెండో ప్రయత్నంలో ఈటెను 89.45 మీటర్లు విసిరాడు. మొత్తంగా 12 మంది పోటీ పడ్డ ఫైనల్‌లో మన బల్లెం వీరుడు రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్తాన్ అథ్లెట్‌ నదీమ్‌ అర్షద్‌ ఈటెను 92.97 మీటర్లు విసిరి స్వర్ణం సాధించాడు. గ్రెనడా అథ్లెట్‌ పీటర్స్‌ అండర్సన్‌ 88.54 మీటర్లు విసిరి కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. గోల్డ్ మెడలిస్ట్ అర్షద్‌.. రెండుసార్లు ఈటెను 90 మీటర్ల కంటె ఎక్కువగా విసిరాడు. 11 మందిలో ఎవరూ కూడా 90 మీటర్ల మార్కును అందుకోలేకపోయారు. 26 ఏళ్ల నీరజ్‌ చోప్రా ఈటెను 89.45 మీటర్ల దూరం విసిరి.. ఈ సీజన్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు.

READ MORE: Dr. Gadala Srinivas Rao: మాజీ హెల్త్ డైరెక్టర్ వీఆర్ఎస్‌ ఆమోదం.. ఉత్తర్వులు జారీ

కాగా.. ప్రస్తుతం నీరజ్ చోప్రాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో నీరజ్ చోప్రా ఇంటిని చూయించారు. హర్యానా రాష్ట్రానికి ఈ అథ్లెట్ కి మూడంతస్తుల లగ్జరీ ఇల్లు ఉంది. దాని ప్రవేశ ద్వారంపై వసుధైవ కుటుంబం అని రాశారు. లోపలికి వెళ్లగానే మీకు.. రేంజ్ రోవర్ స్పోర్ట్, ఫోర్డ్ మస్టాంగ్ జీటీ, టయోటా ఫార్చ్యూనర్, మహీంద్రా ఎక్స్‌యువి700, మహీంద్రా థార్ వంటి మొత్తం ఐదు పెద్ద వాహనాలు వీడియోలో చూడవచ్చు. ఇంతే కాదు.. అతని వద్ద అరడజను బైక్‌లు కూడా ఉన్నాయి. ఓ పెద్ద ట్రాక్టర్ కూడా కనిపించింది. విలాసవంతమైన మూడు అంతస్తుల ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడటం వీడియోలో దర్శనమిస్తుంది. ఇంతే కాకుండా ఇంటి ఆవరణలో ఓ పెద్ద గుడి కూడా ఉంది.

Show comments