ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు దుర్మరణం పాలైన విషయం విదితమే. మృతదేహాలను బయటకు తీసుకొచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాయంత్రంలోపు మృతదేహాలను వెలికి తీసేందుకు ముమ్మర ప్రయాత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 5 మృతదేహాలను బయటకు తీసినట్లు తెలుస్తోంది. మరో మూడు మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటికే జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు లోపలికి వెళ్లి.. జీపీఐ మిషన్, ఆక్వాయి ద్వారా భూమిలోపల మృతదేహాలను ఉన్నట్లు గుర్తించి మార్కింగ్ వేశారు. నేడు ఆ ప్రదేశానికి చేరుకున్న రెస్క్యూ టీం అక్కడున్న బురదను తొలగించింది. అనంతరం లోపల ఉన్న అయిదు మృతదేహాలను వెలికి తీసినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గాంధీ, ఉస్మానియాకు చెందిన మెడికల్ టీం సాయంత్రం వరకు ఇక్కడికి వస్తుంది.
READ MORE: Pollution Control: వాహనదారులకు ప్రభుత్వం షాక్.. ఈ వెహికల్స్ కు పెట్రోల్-డీజిల్ బంద్..?
మిగతా మూడు మృతదేహాలు టీబీసీ మిషన్ దగ్గర ఉన్నాయని భావించారు. వాటిని కూడా సాయంత్రంలోపు వెలికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చనిపోయి చాలా రోజులు అవుతుంది కాబట్టి ఆ మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉంటాయి కాబట్టి ఇక్కడే పోస్టుమార్టం నిర్వహించేందుకు అధికారులు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మృతదేహాలు గుర్తుపట్టే విధంగా ఉంటే.. పోస్టుమార్టం అనంతరం అంబులెన్స్‌లలో తమ సొంత స్థలాలాకు పంపించడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఒక వేళ మృతదేహాలు కుళ్లి పోయిన స్థితిలో, గుర్తు పట్టడానికి రాకుంటే వాటిని గాంధీకి తరలించి డిఎన్‌ఏ టెస్ట్‌లు నిర్వహిస్తారు. ఎట్టకేలకు ఈ రోజుతో మృతదేహాలను వెలికి తీసే అవకాశం కనిపిస్తోంది.
READ MORE: Minister Nara Lokesh: రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది..