Site icon NTV Telugu

Uttarpradesh : ఇద్దరు పిల్లల తల్లితో లేచిపోయిన యువతి.. దాని కోసం తహతహలాడుతోంది

Lesbian

Lesbian

Uttarpradesh : ఒకటిన్నర నెలల క్రితం యూపీలోని హత్రాస్ నుంచి ఓ యువతి అకస్మాత్తుగా తప్పిపోయింది. నోయిడా నుంచి పోలీసులు ఆమెను కనిపెట్టారు. ఆ యువతి ఓ వివాహిత ముస్లిం మహిళతో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటోంది. యువతిని కనుగొన్న తర్వాత పోలీసులు నచ్చ జెప్పినా వినకుండా ఈ ముస్లిం మహిళను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పి కుటుంబంతో వెళ్లేందుకు కూడా నిరాకరించింది. అయితే చాలా మంది ఇది తప్పు అని చెప్పిన తర్వాత యువతి కుటుంబ సభ్యులతో వెళ్లేందుకు ఓకే అంది.

ఓ వార్తాపత్రికలో ప్రచురించిన వార్త ప్రకారం.. ముస్లిం మహిళ బరేలీ నివాసి. కొంతకాలం క్రితం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో హత్రాస్‌కి చెందిన ఒక అమ్మాయితో స్నేహం చేసింది. కొన్ని రోజులు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరూ ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. తర్వాత ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తన భర్త తనను కొట్టేవాడని ముస్లిం మహిళ చెప్పింది. అందుకే తన ఇద్దరు పిల్లలతో విడిగా జీవించడం ప్రారంభించింది. హత్రాస్‌కి చెందిన ఓ అమ్మాయితో స్నేహం కుదిరినప్పుడు.. ఆ అమ్మాయికి ఆ ముస్లీం మహిళ అంటే ఇష్టం ఏర్పడింది. కొద్ది కాలానికే ఇద్దరి మధ్య ఎఫైర్ మొదలైంది. కలిసి జీవించడానికి సమాజం అనుమతించదని ఇద్దరికీ తెలుసు. అందుకే హత్రాస్‌కు చెందిన బాలిక తన ఇంటికి చెప్పకుండా నెలన్నర క్రితం నోయిడాకు వచ్చింది. అప్పటికే ఇద్దరు పిల్లలతో ముస్లిం మహిళ ఇక్కడ నివసిస్తోంది. ఇద్దరూ మళ్లీ కలిసి జీవించడం ప్రారంభించారు.

Read Also:Viral: ఎవర్రా మీరంతా.. ఒక్కసారిగా వధువుపై పడ్డ అతిథులు.. చివరకి..?!

మరోవైపు, యువతి కుటుంబం హత్రాస్‌లో తమ కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు తన కోసం గాలింపు ముమ్మరం చేశారు. సాంకేతిక నిఘా సహాయంతో పోలీసులు యువతిని గుర్తించారు. ఆ తర్వాత బుధవారం ముస్లిం మహిళ ఇంటి నుంచి యువతి కనిపెట్టి తీసుకొచ్చారు. ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు రప్పించారు. యువతి కుటుంబీకులు కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వారు ఆమెను ఇంటికి తీసుకెళ్దామని కోరినప్పుడు యువతి వారితో వెళ్లేందుకు నిరాకరించింది. తాను ముస్లిం మహిళను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పింది.

తాను కూడా అమ్మాయిని సమానంగా ప్రేమిస్తున్నానని ముస్లిం మహిళ చెప్పింది. ఎందుకంటే ఈ అమ్మాయి నుండి తనకు లభించిన ప్రేమ తన భర్త నుండి ఆమెకు ఎప్పుడూ లభించలేదు. ఇద్దరూ పెళ్లి విషయంలో మొండిగా ఉన్నారు. అనంతరం పోలీసులు వారికి చాలా విషయాలు వివరించారు. సుదీర్ఘ వివరణ అనంతరం యువతిని కుటుంబసభ్యులకు అప్పగించారు.

Read Also:North Korea: యుద్ధానికి సిద్ధం.. కమాండర్లతో నార్త్ కొరియా అధ్యక్షుడు భేటీ..?

Exit mobile version