Site icon NTV Telugu

Jyoti Malhotra: “అవును.. పాకిస్థాన్ కోసం పని చేశా” నేరాన్ని అంగీకరించిన జ్యోతి మల్హోత్రా

Jyoti Malhotra

Jyoti Malhotra

పాకిస్థాన్‌కు స్పై ఏజెంట్గా పని చేస్తూ దొరికిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా నిజం ఒప్పుకుంది. తాను పాకిస్థాన్ గూఢచారిని అని ఆమె అంగీకరించింది. విచారణ అధికారులు ఎదుట నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ కోసం పని చేసినట్లు జ్యోతి తెలిపినట్లు తెలుస్తోంది. ఐఎస్‌ఐ అధికారులను పలు మార్లు కలవడంతో పాటు వాళ్లు అడిగిన సమాచారన్ని
చేరవేసినట్లుగా విచారణ సమయంలో ఆమె అంగీకరించింది. దీని కోసం ఐఎస్‌ఐ ఏజెంట్లతో రహస్యంగా చాట్ చేసినట్లు జ్యోతి వివరించినట్లు తెలుస్తోంది.

READ MORE: Virat Anushka: పికిల్‌బాల్ భాగస్వాములుగా మారిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట..!

మరోవైపు… పాక్‌ హైకమిషన్‌ ఉద్యోగి డానిష్‌ వీసా విభాగంలో పని చేసేవాడు. పంజాబ్‌లోని మలేర్‌కోట్లా ప్రాంతానికి చెందిన గజాల అనే యువతిని కూడా హనీట్రాప్‌లోకి లాగి.. గూఢచర్యానికి వాడుకొన్నట్లు తెలుస్తోంది. ఆమె తన కుటుంబలోని వారికి వీసాల కోసం ఫిబ్రవరి 2వ తేదీన పాక్‌ హైకమిషన్‌కు వెళ్లింది. ఆ మర్నాడు వారి వీసాలు ఎప్పుడు వస్తాయో తెలుసుకొనేందుకు గజాలా ఆంటీ నస్రీన్‌ బానో హైకమిషన్‌కు వెళ్లింది. నాడు గజాలా వీసా మినహా అందరివి ఓకే అయినట్లు వెల్లడించారు. అదేనెల 27వ తేదీన హైకమిషన్‌లో వీసా ఆఫీసర్‌ అంటూ డానిష్‌ నుంచి గజాలకు మెసేజ్‌ వచ్చింది. నాటినుంచి ఇద్దరి పరిచయం పెరిగింది. మరో ఫోన్‌ నెంబర్‌ నుంచి టెలిగ్రామ్‌ యాప్‌ వాడాలని ఆమెకు సూచించాడు. చివరికి ఏప్రిల్‌లో డానిష్‌ సాయంతో ఆమె పాక్‌ వీసా పొందింది. ఆ తర్వాత అతడికి పెళ్లైనట్లు ఆమె గుర్తించింది. మరోవైపు డానిష్‌ ఆమెను మెల్లగా గూఢచర్యానికి వాడుకోవడం మొదలుపెట్టాడు.

READ MORE: Mallu Ravi: తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారు..

Exit mobile version