Site icon NTV Telugu

Haryana: నాకు వరకట్నం వద్దు.. రూ.31 లక్షలు తిరిగి ఇచ్చేసిన వరుడు!

Toi

Toi

దేశంలో ఓ వైపు వరకట్నం వేధింపులు పెరుగుతున్నాయి. భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక నిండు గర్భిణులు సైతం ఆత్మహత్య చేసుకున్న చాలా ఘటనలు మనం చూసే ఉన్నాం. కానీ.. ఈ విషయం మాత్రం ప్రస్తుతం అందరినీ అబ్బురపరుస్తోంది. కలియుగంలోనూ ఓ యువకుడు పెద్ద మనసు చాటుకున్నాడు. పెళ్లి సందర్భంగా అత్తామామలు ఇచ్చిన రూ.31 లక్షల వరకట్నాన్ని వాళ్లకే తిరిగిచ్చేసి ఆదర్శంగా నిలిచాడు. వరుడి సూచన మేరకు కేవలం రూపాయి నాణెం, ఒక కొబ్బరి కాయతో మొత్తం వివాహ క్రతువు ముగించేశాడు.

READ MORE: India Pakistan: దాయాదికి దెబ్బ మీద దెబ్బ.. పాక్ నౌకలకు భారత జలాల్లోకి ప్రవేశం నిషేధం..

ఈ అరుదైన ఘటన హరియాణాలోని కురుక్షేత్రలో చోటు చేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహారన్‌పుర్‌ జిల్లా భాబ్సి రాయ్‌పుర్‌ గ్రామానికి చెందిన శ్రీపాల్‌ రాణా కుమారుడు వికాస్‌ రాణా వృత్తిరీత్యా న్యాయవాది. అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తతడు. శ్రీపాల్‌ రాణా బీఎస్పీ టికెట్‌పై యూపీలోని కైరానా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసినట్లు సమాచారం. వికాస్‌కు హరియాణాలోని లుక్ఖి గ్రామానికి చెందిన అగ్రికా తన్వర్‌తో పెళ్లి కుదిరింది. ఏప్రిల్‌ 30న వికాస్‌ రాణా కుటుంబం పెళ్లి కోసం కురుక్షేత్రకు వెళ్లారు. నగరంలోని ఒక హోటల్‌లో వివాహ వేడుకకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా తిలకం వేడుక జరుగుతున్న సమయంలో వికాస్‌ రాణాకు వరకట్నంగా రూ.31 లక్షల నగదును వధువు తల్లిదండ్రులు ఇచ్చారు. దీంతో వరుడు ఈ నగదును సున్నితంగా తిరస్కరించాడు. తమకు వధువే ఒక కట్నం అని వికాస్‌ రాణా అన్నారు. ఈ మాటలు వధువు బంధువులు సంతోషించారు. మంచి మనసు చాటుకున్న వరుడిని పొగడ్తలతో కొనియాడారు.

READ MORE: janulyri : జానులిరి, నేను పెళ్లి చేసుకుంటున్నాం.. దిలీప్ దేవ్ గన్ క్లారిటీ..

Exit mobile version