Site icon NTV Telugu

Harshaali Malhotra: ఆయనతో నటించడం నా అదృష్టం.. అఖండ2 అందరినీ అలరిస్తుంది..!

Balakrishna Harshaali Malhotra

Balakrishna Harshaali Malhotra

Harshaali Malhotra: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో నిర్మితమవుతున్న పవర్‌ఫుల్ డివైన్ యాక్షన్ డ్రామా ‘అఖండ 2: తాండవం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా 2D, 3D ఫార్మాట్‌లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమాలో కీలక పాత్ర పోషించిన హర్షాలి మల్హోత్రా మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు.

దాదాపు పదేళ్ల తర్వాత థియేటర్స్‌కి రీఎంట్రీ:
“ఈ చిత్రంలో ‘జనని’ అనే స్వీట్, కేరింగ్ పాత్రలో కనిపించబోతున్నాను. జననీకి అఖండ ఆశీర్వాదాలు ఉంటాయి. ఆమె ఎప్పుడు ప్రమాదంలో పడినా అఖండ వచ్చి రక్షిస్తారు. బజరంగీ భాయిజాన్ తర్వాత ఇంత గ్యాప్ వచ్చినా, మంచి పాత్ర కోసం ఎదురు చూశాను. ఆ అవకాశం అఖండ 2తో దక్కిందని హర్షాలి చెప్పారు.

Mana Shankaravaraprasad Garu: మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లపై అదిరిపోయే మాస్ డ్యాన్స్ సాంగ్..!

బాలయ్యతో నటించడం అంటే అదృష్టం:
లెజెండరీ నటుడు నందమూరి బాలకృష్ణతో నటించడం నా అదృష్టం. మొదట్లో చాలా నెర్వస్‌గా అనిపించింది. కానీ ఆయన కేర్‌తో గైడ్ చేశారు. ఒక ఫ్యామిలీ మెంబర్‌లా చూసుకున్నారు. ఆయన ఎనర్జీ అన్‌స్టాపబుల్. సెట్లో ఆయనతో పనిచేయడం గొప్ప అనుభవం అని హర్షాలి చెప్పుకొచ్చారు.

బోయపాటి శ్రీను గారి డైరెక్షన్ అమేజింగ్:
బోయపాటి గారి గురించి మాట్లాడుతూ.. ఆయన ఎంతో కేర్ తీసుకునే దర్శకుడు. నేను నెర్వస్‌గా ఫీల్ అయితే, ‘నీకు ఇది వస్తుంది’ అని ప్రోత్సహించేవారు. సీన్ ముగిసిన తర్వాత ప్రశంసిస్తారు. ఆయన ఎనర్జీ నా నటనను మరింత మెరుగుపరిచింది. జనని పాత్ర కోసం నన్నే ఎంచుకోవడం నా అదృష్టం అనిపించిందని అన్నారు.

షూటింగ్ లో ఎదుర్కొన్న చాలెంజ్‌లు:
మైనస్ డిగ్రీల్లో షూట్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. అలాంటి లొకేషన్స్‌లో పని చేయడం నిజంగా చాలెంజింగ్. అలాగే ఈ సినిమాలో కొన్ని యాక్షన్ స్టంట్స్ కూడా చేశాను. ఆ అనుభవం చాలా స్పెషల్ అని హర్షాలి తెలిపారు.

India vs South Africa 1st ODI: రోహిత్-కోహ్లీ వీర బాదుడు.. రాహుల్ ఫినిషింగ్ టచ్.. దక్షిణాఫ్రికా ముందు భారీ టార్గెట్..!

బాలీవుడ్ కే కాదు, టాలీవుడ్‌కు కూడా ప్రత్యేక అనుబంధం:
రెండో సినిమానే తెలుగు చిత్రం కావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. బాలకృష్ణతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభూతని ఆమె అన్నారు. తెలుగులో ఇష్టమైన స్టార్స్ గురించి మాట్లాడుతూ.. బాలకృష్ణ, అల్లు అర్జున్, ప్రభాస్ నాకు చాలా ఇష్టం అని తెలిపారు.

సల్మాన్ ఖాన్‌తో జ్ఞాపకాలు:
బజరంగీ భాయిజాన్ సమయంలో సల్మాన్ ఖాన్ గారితో ఎంతో ఫన్ మూమెంట్స్ ఉన్నాయి. మేము టేబుల్ టెన్నిస్ ఆడేవాళ్లం. అలానే బాలకృష్ణతో కూడా చాలా సరదాగా గడిచింది. అయితే ఆయన ఎనర్జీ కోసం ఇచ్చే కషాయం మాత్రం నాకిష్టం కాదు.. ఎందుకంటే నాకు అల్లం ఇష్టం ఉండదు అని నవ్వుతూ చెప్పారు.

భవిష్యత్తు లక్ష్యాలు:
సంజయ్ లీలా భన్సాలీ గారి సినిమాలో నటించాలనేది నా డ్రీమ్. ఆయన చూపించే హీరోయిన్స్ చాలా గ్రేస్‌ఫుల్‌గా ఉంటారు. నా కెరీర్‌లో అన్ని రకాల జానర్స్ చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఛాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉంది అని హర్షాలి వెల్లడించారు.

Exit mobile version