పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా తెరకేక్కుతున్న సంగతి తెలిసిందే.. ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ సినిమా గురించి ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ సినిమా పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో షూటింగ్స్ కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి.. అయితే హరీష్ ఖాళీగా ఉన్నారు..తాజాగా ఈయన సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ను షేర్ చేశారు.. అల్లు అర్జున్ తో డైరెక్షన్ చేస్తున్న ఓ ఫోటోను షేర్ చేశాడు..
అయితే అది సినిమా షూట్ కాదని, ఓ యాడ్ అని తెలుస్తుంది.. పుష్ప తర్వాత బన్నీ అనేక యాడ్ లలో నటిస్తూ వస్తున్నాడు.. త్వరలో మరో యాడ్ తో రాబోతున్నారు. ఈ యాడ్ కి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. నిన్న హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన యాడ్ షూట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ జరిగినట్లు తెలుస్తుంది.. ఆ ఫొటోలో హరీష్ శంకర్ డైరెక్టర్ కుర్చీలో కూర్చున్నాడు.. అయితే ఇది ఏ ప్రోడక్ట్ కి సంబంధించిన యాడ్ అనేది ఇంకా సమాచారం లేదు..
వీరిద్దరి కాంబినేషనబీలో డీజే సినిమా వచ్చింది.. ఆ సినిమా ఎంతగా హిట్ టాక్ ను అందుకుందో తెలిసిందే.. ఆ సినిమా తర్వాత పూజా హెగ్డే లైఫ్ మారిపోయింది.. ఇక బన్నీ కొత్త యాడ్ లో నటిస్తున్నాడు అని తెలియడంతో అది ఏం యాడ్, ఆ యాడ్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కాబోతుంది..
Something interesting …
In between movie shoots…. @DoP_Bose 😍😍😍 pic.twitter.com/6e3gBl3NNu— Harish Shankar .S (@harish2you) December 11, 2023