Site icon NTV Telugu

Harish Shankar: పవన్ కల్యాణ్ నిజాయతీపై హరీశ్ శంకర్ సెన్సేషనల్ కామెంట్స్..

Harish Shankar

Harish Shankar

Harish Shankar: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ డైరెక్టర్ హరీశ్‌ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలోని రెండో పాట ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ను ఆదివారం మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థుల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు హరీశ్‌ శంకర్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ నిజాయతీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

READ ALSO: Donald Trump: ట్రంప్ ఇంట్లోకి ఆగంతకుడు.. కాల్చి చంపిన సెక్యూరిటీ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గబ్బర్‌ సింగ్‌ చిత్రంతో పవన్ కల్యాణ్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. అప్పట్లోనే షారుక్‌ ఖాన్‌తో సమానమైన భారీ రెమ్యూనరేషన్‌ను ఆఫర్ చేస్తూ కొన్ని కార్పొరేట్ సంస్థలు ప్రకటనల కోసం ఆయన్ని సంప్రదించాయి. కానీ, ఆ ఉత్పత్తులు ఆరోగ్యానికి, ముఖ్యంగా చిన్నపిల్లలకు మంచివి కావన్న ఉద్దేశంతో ఆయన కళ్లముందే కోట్ల రూపాయల ఆఫర్లను వద్దనుకున్నారు. డబ్బుకు ఏమాత్రం లొంగని వ్యక్తి ఆయన’’ అని హరీశ్ ప్రశంసించారు. సాధారణంగా హీరో ఇంట్రో సాంగ్స్ ఎవరికైనా సెట్ అవుతాయని, కానీ ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ మాత్రం కేవలం పవన్ కల్యాణ్ కోసం రాసినదని హరీశ్ తెలిపారు.

పవన్ కల్యాణ్ జీవనశైలి, ఆయన రాజకీయ, సినీ ప్రయాణంపై ఉన్న అవగాహనతో చంద్రబోస్ ఈ పాటలోని ప్రతి పదాన్ని అద్భుతంగా రాశారని చెప్పారు. దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లారని, అభిమానులు పాలాభిషేకం చేస్తే.. తన టీమ్ ఇలా సిరాభిషేకం, పాటాభిషేకం చేశారని కొనియాడారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 26న థియేటర్స్‌లోకి రాబోతుంది. పవన్‌ కల్యాణ్ ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో అవన్నీ సినిమాలో పుష్కలంగా ఉంటాయని హరీశ్ శంకర్ ఫ్యాన్స్‌కు భరోసా ఇచ్చారు.

READ ALSO: Aura of Ustaad: మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే.. ఆరా ఆఫ్ ఉస్తాద్ అదిరింది!

Exit mobile version