Harish Rao: కేటీఆర్‌కి సిట్ నోటీసులపై హరీష్‌రావు ఫైర్ అయ్యారు. నోటీసులు నేపథ్యంలో గురువారం మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదని తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజలకు ఇస్తే రేవంత్ ప్రజల ఖాతా నుంచి తీసుకుంటా అంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ మంత్రులు, ఉప ముఖ్య మంత్రులను జనాలు హామీలపై నిలదీస్తున్నారన్నారు. తాను, కేటీఆర్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదిస్తుంటే సిట్ నోటీసులు ఇస్తున్నారన్నారు. వాళ్లు ఎన్ని నోటీసులు ఇచ్చినా.. ఇచ్చినా హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, డైవర్షన్ చేసినా నీ వెంట పడతామని తెలిపారు. నీ బావమరిది కుంభకోణం బయటికి రావొద్దని ఇలా చేస్తున్నావా? అని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. వాటాల కోసం కాంగ్రెస్ మంత్రులు కొట్టుకుంటున్నారని.. కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు.. కాంగ్రెస్ మంత్రులు బయటికి రావాలంటే జంకుతున్నారన్నారు. “ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడబోం.. నీ వెంటే పడతాం, నీ అటెన్షన్ డైవర్షన్‌లకు భయపడబోం.. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేసే వరకు మీ వెంటపడుతూనే ఉంటాం” అని హరీష్ రావు పేర్కొన్నారు.
Harish Rao: “మాకు నోటీసులు ఇవ్వడానికి కారణం ఇదే”.. సిట్ నోటీసులపై హరీష్‌రావు ఫైర్

Harish Rao