Site icon NTV Telugu

Harish Rao: ఎన్టీవీ భుజంపై తుపాకీ పెట్టి మీడియాను సీఎం భయపెడుతున్నారు..

Harish Rao

Harish Rao

Harish Rao: ఎన్టీవీ భుజంపై తుపాకీ పెట్టి అన్ని మీడియా ఛానెళ్లను సీఎం రేవంత్ భయపెడుతున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. అర్ధరాత్రి జర్నలిస్టులను అరెస్ట్ చేసి వికృత ఆనందం పొందుతున్నారని తీవ్రంగా విమర్శించారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మీడియా ప్రశ్నించడం మానేస్తే అధికారంలో ఉన్నవాళ్లు బరితెగిస్తారని.. ప్రజలకు గొంతుక లేకుండా పోతుందని హితవు పలికారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం మీడియా.. మీడియాని రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డికి మీడియా అంటే ఎందుకో కోపం ఉంది.. జర్నలిస్టులను చూస్తే చెంపలు పగలగొట్టాలని అనిపిస్తుందని సీఎం రేవంత్ ఓ సారి అన్నారని గుర్తు చేశారు.

READ MORE: Jagga Reddy: “ఇది మంచిది కాదు”.. జర్నలిస్టుల అరెస్టులను తీవ్రంగా ఖండించిన జగ్గారెడ్డి..

స్వేచ్చని ఏడో గ్యారెంటిగా ఇస్తున్నామని ఆనాడు రేవంత్ గొప్పలు చెప్పారని మాజీ మంత్రి హరీష్‌రావు గుర్తు చేశారు. “ప్రశించే హక్కు ఇస్తున్నామన్న రేవంత్ అధికారంలో వచ్చాక ఎమర్జెన్సీని తలపిస్తున్నారు.. అరెస్ట్ చేసిన జర్నలిస్టులు ఉగ్రవాదులా..? టెర్రరిస్టులా..? ఈ ఘటన జరిగినప్పుడు రిపోర్టర్ చారి శబరిలో ఉన్నారు.. అయిన ఆయనని అరెస్ట్ చేశారు.. దళిత బిడ్డ సుధీర్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు పెడుదామని ప్లాన్ వేశారు.. సజ్జనార్ కాంగ్రెస్ కండువా కప్పుకో.. ఆనాడు కేటీఆర్ పై అడ్డగోలుగా మంత్రి సురేఖ మాట్లాడినప్పుడు మీ చట్టం ఏం చేసింది.. ఆనాడు బాధపడ్డది ఓ ఆడబిడ్డ కాదా?ఆనాడు ఖాకి బుక్కు పనిచేయలేదా సజ్జనార్.. ఈనాడు చట్టం చుట్టం అయ్యిందా సజ్జనార్.. మంత్రి, ఆయన కొడుకు కబ్జాలు చేస్తే వాళ్లపై ఎందుకు కేసులు పెట్టలేదు.. ఎందుకు సిట్ ఏర్పాటు చేయలేదు.. కాంగ్రెస్ నాయకులకు చట్టం చుట్టం అయ్యిందా..? నాపై సిద్ధిపేటలో కాంగ్రెస్ నాయకుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మా పార్టీ నాయకుడు ఫిర్యాదు చేస్తే ఇప్పటికి ఎందుకు అరెస్ట్ చేయలేదు.. రేవంత్ రెడ్డి మిడ్ నైట్ కాగానే రేమో లా అవుతున్నారు. రేవంత్ రెడ్డిలో అర్ధరాత్రి అరాచకవాది నిద్ర లేస్తారు. అర్ధరాత్రి సహచర మంత్రి కొండా సురేఖ ఇంటికి రేవంత్ పోలీసులను పంపారు.. మహిళ జర్నలిస్టుల ఇంటికి అర్ధరాత్రి పోలీసులను పంపి అరెస్ట్ చేయించారు..” అని హరీష్‌రావు వ్యాఖ్యానించారు.

READ MORE:KTR: జర్నలిస్టుల ఇళ్లపై అర్ధరాత్రి దాడులు చేయడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు

 

Exit mobile version