Harish Rao: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోంగార్డులందరికీ రైజింగ్‌డే శుభాకాంక్షలు తెలిపారు మజీ మంత్రి హరీష్‌రావు.. ప్రజాభద్రత, విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణలో మీరు అందిస్తున్న సేవలు అమూల్యమని కొనియాడారు.. హోంగార్డుల సేవలను గుర్తించిన బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో రూ. 9000 గా ఉన్న వేతనాన్ని, రూ. 27,600 కు పెంచిందన్నారు. ట్రాఫిక్ లో విధులు నిర్వహించే వారికి 30% రిస్క్ అలవెన్స్ ఇచ్చింది. మహిళా హోంగార్డులకు ప్రసూతి సెలవులు ఇచ్చి ఆత్మ గౌరవం పెంచిందని తెలిపారు. కేసీఆర్.. ప్రగతి భవన్ వేదికగా హోంగార్డులతో సమావేశమై వేతనాల పెంపుతో పాటు వారి అనేక అపరిస్కృత సమస్యలకు పరిష్కారం చూపారని పేర్కొన్నారు.
READ MORE: RGV-Show Man: రామ్‌గోపాల్ వర్మ హీరోగా “షో మ్యాన్”.. మాస్ లుక్‌లో ఆర్జీవీ..
“విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి రూ.5లక్షల బీమా అందజేస్తూ, కార్యక్రమాల నిర్వహణకు ఇచ్చే 5 వేల రూపాయలను రూ.10 వేలకు పెంచారు. మొత్తంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం హోంగార్డుల వేతనాలు, ఇతర భత్యాలకు ఏడాదికి సుమారు రూ.600 కోట్లకుపైగా ఖర్చు చేయడంతో వారి కుటుంబాలు గౌరవంగా బతికాయి. కాంగ్రెస్ సర్కార్ కేవలం బీఆర్‌ఎస్ ఇచ్చిన రోజువారీ వేతనం రూ.921కి మరో 79 కలిపి మొత్తం రూ.వెయ్యి చేసి ఎంతో చేసినట్టుగా గప్పాలు కొట్టడం నయ వంచనే అవుతుంది. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అవి అమలు చేయకపోగా, తన వికృత చేష్టలతో హోంగార్డులను తీవ్రంగా అవమానిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల మందికి పైగా ఉన్న హోంగార్డులతో ఎన్నో పనులు చేయించుకుంటున్న ప్రభుత్వం, పోలీసుశాఖ.. వారి సంక్షేమాన్ని మాత్రం గాలికొదిలింది. వారి బతుకులను రోడ్డు పాలు చేసింది. హోంగార్డ్ ల సమస్య లు వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం..” అని మాజీ మంత్రి హరీష్‌రావు సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చారు.
