Harish Rao: బీఆర్ఎస్ బేజేపీతో కుమ్మక్కయిందని అబద్ధాలు ప్రచారం చేశారు.. అదే నిజమైతే కేసీఆర్ బిడ్డ ఎందుకు జైలుకు ఎందుకు వెళ్తుంది? అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కోమటిరెడ్డి ఫ్యామిలీకి రెండు, జానారెడ్డికి ఫ్యామిలీకి రెండు ఉద్యోగాలు వచ్చాయన్నారు. రేవంత్ రెడ్డి ఒక్కసారన్న జై తెలంగాణ అన్నాడా? అని ప్రశ్నించారు. అమరవీరుల స్తూపం వద్ద ఒక పువ్వు పెట్టని రేవంత్ ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడన్నారు. గ్యారంటీలు అమలు చేయడం చేతకాక తిట్లు, దేవుడిపై ఒట్లు అని కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువుల ఆస్తి ముస్లింలకు పంచుతారని బీజేపీ దుష్ర్ర్ర్పచారం చేస్తోందన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందన్నారు.
Read also: Sai Dharam Tej : మామ కోసం బరిలోకి సాయి ధరంతేజ్.. వాళ్లందరికీ భిన్నంగా?
ఎన్ని కష్టాలు వచ్చిన కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఆపలేదన్నారు. రేవంత్ రెడ్డి కేబినెట్లో ఒక్క ముస్లిం లేడన్నారు. కేసీఆర్ అసలైన సెక్యులరిస్టు అన్నారు. బీఆర్ఎస్, బేజేపీతో కుమ్మక్కయిందని అబద్ధాలు ప్రచారం చేశారన్నారు. అదే నిజమైతే కేసీఆర్ బిడ్డ ఎందుకు జైలుకు ఎందుకు వెళ్తుందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. కేంద్రంలో మనం చక్రం తిప్పాలన్నా, కాంగ్రెస్ మెడలు వంచాలన్నా కారు గుర్తుకు ఓటేయాలన్నారు. ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చురుకుపెట్టాలన్నారు.
Sai Dharam Tej : మామ కోసం బరిలోకి సాయి ధరంతేజ్.. వాళ్లందరికీ భిన్నంగా?
