NTV Telugu Site icon

Harish Rao: రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి..

Harish Rao

Harish Rao

Harish Rao: రైతు ఆత్మహత్యలపై ట్విట్టర్ ( X ) వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు పలు కామెంట్స్ చేసారు. ముగ్గురు మంత్రులున్న జిల్లాలో నెలలో అయిదుగురు రైతుల ఆత్మహత్య ప్రయత్నాలా..? ఖమ్మం జిల్లాలో ఒక్క నెలలోనే అయిదుగురు రైతులు ఆత్మహత్యలకు ప్రయత్నించడం, ఇద్దరు మరణించడం తీవ్రమైన అంశంగా అయ్యన పేర్కొన్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సహా రాష్ట్ర కేబినెట్‌ లోని ముగ్గురు మంత్రులున్న జిల్లాలోనే రైతులకు ఈ దుస్థితి ఉందంటే.. రాష్ట్రంలో రైతుల తీరు ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటూ ఆయన అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు రైతుల సమస్యలను తీర్చేందుకు ఏలాంటి సహాయం చేయకపోగా వారిని కొత్త సమస్యల్లోకి నెట్టివేస్తున్నదని., ఇది ఏమాత్రం క్షమార్హం కాదు అంటూ పేర్కొన్నారు.

Stock market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం మాటలకు పరిమితమయ్యిందని., రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని., ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించాలని., మరణించిన రైతు కుటుంబాలను ఆదుకోవాలంటూ ఆయన అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించి కనీసం వారి కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని., రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరగకుండా రైతులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ హరీష్ రావు పేర్కొన్నారు.

Balka Suman: రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారింది.. మాజీ ఎమ్మెల్యే

Show comments