Harish Rao: సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు దాతృత్వం ప్రదర్శించారు. పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య ఫీజు కోసం బ్యాంకులో తన స్వగృహాన్ని మార్టిగేజ్(తాకట్టు) పెట్టారు. మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్ లో సీటు రావడంతో ట్యూషన్ ఫీజులకు ఏటా 7.50లక్షల రూపాయలు చెల్లించాలని కళాశాల యాజమాన్యం తెలిపింది. బ్యాంకు రుణం కోసం వెళ్లగా ఏదైనా ఆస్థిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామని బ్యాంకు సిబ్బంది స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని విద్యార్థిని మమత, తండ్రి రామచంద్రం హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లారు. సిద్దిపేటలోని తన స్వగృహాన్ని బ్యాంకులో తనఖా పెట్టి రూ. 20 లక్షల ఎడ్యూకేషన్ లోన్ మంజూరు చేయించారు. హాస్టల్ ఫీజుకి లక్ష రూపాయలు సహాయం చేశారు.
READ MORE: Cash-for-Query Case: ఢిల్లీ హైకోర్టులో మహువా మొయిత్రాకి బిగ్ రిలీఫ్..
