Site icon NTV Telugu

Harish Rao: కాళేశ్వరంపై కక్షగట్టారు, పాలమూరుపై పగబట్టారు..

Harish Rao

Harish Rao

Harish Rao: ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాజకీయాల కోసం కాదు.. ఇది పూర్తి నిబద్ధతతో, సాక్ష్యాధారాలతో చూపిస్తున్న పీపీటీ అని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుకు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు.. కుట్రపూరితంగా ప్రాజెక్టులను నిర్లక్ష్యంగా చేస్తున్నారన్నారు. కాళేశ్వరంపై కక్షగట్టారు, పాలమూరుపై పగబట్టారని ఆరోపించారు.. 2004-14 వరకు కాంగ్రెస్ పాలనలో 6. 64 లక్షల ఎకరాలు మాత్రమే నీళ్లు ఇచ్చారన్నారు. 9 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 48.74 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిందని చెప్పారు.

READ MORE: T20 World Cup controversy: భారత్‌లో టీ20 ఆడేది లేదన్న బంగ్లాదేశ్.. అంత ఈజీ కాదన్న బీసీసీఐ

పాలమూరు ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టులను కొనసాగిస్తామని కేసీఆర్ స్పష్టంగా చెప్పారని హరీష్ రావు తెలిపారు.. టెలీమెట్రీ పెట్టాలని కేసీఆర్ ఎప్పుడో ఒప్పించారు.. 2016లోనే టెలీమెట్రీని ఏర్పాటు చేశారన్నారు.. అపెక్స్ కౌన్సిల్ సమావేశం అజెండా అంశాలను సీఎం సగం మాత్రమే చెప్పారని ఆరోపించారు.. కేంద్రమంత్రి, జగన్ సమక్షంలోనే పోతిరెడ్డిపాడును కేసీఆర్ వ్యతిరేకించారు.. పోతిరెడ్డిపాడును ఆపకపోతే అలంపూర్ వద్ద ప్రాజెక్టు నిర్మిస్తానని కేసీఆర్ హెచ్చరించారని గుర్తు చేశారు. అసలు మొదట తెలంగాణను ఆంధ్రప్రదేశ్ లో కలిపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. మలి దశ ఉద్యమంలో ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ అని తీవ్రంగా విమర్శించారు. “పాలమూరు జిల్లా ను వలసల జిల్లాగా మార్చింది కాంగ్రెస్ పార్టీ.. పాలమూరు, నల్గొండ జిల్లా లకు మరణ శాసనం గా మార్చింది కాంగ్రెస్.. ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన నాగార్జున సాగర్ ను నంది కొండ దగ్గర కట్టి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ.. ఉత్తమ్‌ కట్టుకథలు, రేవంత్ పిట్ట కథలు చెప్పారు.. విభజన సమయంలోనూ మనకు అన్యాయం చేసిందే కాంగ్రెస్.. 11వ షెడ్యూల్‌లో పాలమూరు-రంగారెడ్డి పెట్టలేదు.. మొదటి నుంచి కేసీఆర్ చెబుతున్న మాటలు నేడు అక్షర సత్యం.. రేవంత్‌ రెండేళ్లలోనే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పచెబుదామంటారు.. కృష్ణానదీజలాల్లో అతి తక్కువ వినియోగం చేస్తారు.. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు లోపాయికారి ఒప్పందం.. తెలంగాణ ప్రాజెక్టులను కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. అసెంబ్లీ లో పచ్చి అబద్ధాలు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.. ఇన్ని అబద్ధాలు, తప్పులు మాట్లాడిన రేవంత్ రెడ్డి వెంటనే రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామా చేయాలి.. నేను ఇలా మాట్లాడితే నా మీద కేసులు పెడతారు. నా మీద హత్యాయత్నం చేస్తారు.. గతంలో నేను ఖమ్మం పర్యటన కు వెళ్ళి నప్పుడు నా మీద దాడి చేశారు” అని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.

Exit mobile version