Site icon NTV Telugu

Harish Rao: తెలంగాణ వాళ్లకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.. హరీష్ రావు..

Harish Rao

Harish Rao

Harish Rao: నేడు తెలంగాణ భవన్ లో హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానాలతో ఇక్కడ తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని., కనీస అవగాహన లేకుండా ఎంబీబీస్ సీట్ల కోసం ప్రభుత్వం జీవో తెచ్చింది. అసలు అధ్యయనం చేయకుండా తెచ్చిన ఈ జీవో వల్ల స్థానికులు స్థానికేతారులుగా మారుతారని., మేము తెచ్చిన జీవో తో విద్యార్థులకు న్యాయం జరిగిందని., మా హయాంలో 30 వరకు కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని ఆయన చెప్పుకొచ్చారు. 95 శాతం పైగా ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకే వచ్చే విదంగా మేము చేశామని., బి కేటగిరీలో కూడా తెలంగాణ వాళ్ళకే సీట్లు ఎక్కువగా ఇచ్చాము. కొత్తగా ఏర్పాటు చేసిన కాలేజీల్లో రిజర్వ్డ్ కోటా లేకుండా చేశారు. వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదవకుంటే నాన్ లోకల్ అని ప్రభుత్వం కొత్తగా జీవో తెచ్చింది.

CM Chandrababu: చేనేత దినోత్సవం.. సతీమణి కోసం స్వయంగా చీరలు కొన్న సీఎం చంద్రబాబు

ఈ నాలుగేళ్ల నిబంధన తెలంగాణ వాళ్లకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇంటర్ తో పాటు లాంగ్ టర్మ్ కోసం వేరే రాష్ట్రాలకు వెళతారు.., ఇలా వరుసగా నాలుగేళ్ళు చదవకుంటే నాన్ లోకల్ అని ప్రభుత్వం జీవో ఇచ్చిందని., మెడిసిన్ ప్రవేశాలకు సమగ్ర ప్రణాళిక ఈ ప్రభుత్వానికి లేదని., జీవో 33 సక్రమంగా లేదు.. దీనివల్ల తెలంగాణ విద్యార్థుల కు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన వాపోయారు. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు అఖిలపక్షం ఏర్పాటు చేయలని., మేము వచ్చి మీకు సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని., ప్రభుత్వం వెంటనే హై లెవల్ కమిటీ వేసి ఈ స్థానికత పై చర్చించాలని ఆయన అన్నారు.

IND vs SL: స్పిన్ తో మాయచేసిన రియాన్ పరాగ్.. టీమిండియా టార్గెట్ 249..

Exit mobile version