అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం అని అన్నారు మంత్రి హరీష్ రావు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని CSI చర్చిలో జరుగుతున్న వేడుకల్లో మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కేక్ కట్ చేశారు. ముందుగా ప్రతి ఒక్కరికీ పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..దేశంలో క్రిస్మస్ పండుగకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అన్నారు. సీఎం హోదాలో క్రైస్తవ సోదరులకు విందు ఏర్పాటు చేసి సాంప్రదాయాలను గౌరవించిన నాయకుడు కేసీఆర్ అన్నారు.
ఎన్ని మతాలు, ఎన్ని కులాలు ఉన్నా ప్రజాస్వామ్య పద్ధతిలో ఒకే దగ్గర అన్ని వర్గాల ప్రజలు కలిసి ఉంటున్న గొప్ప దేశం మన భారతదేశం అన్నారు. దేశ సమగ్రతను సౌభ్రాతృత్వం కాపాడుతూ అభివృద్ధి లో ముందుకు సాగాలన్నారు. కుల మతాలతో సంబంధం లేకుండా పేదలకు సహాయం చేయడమే మన మొదటి ధ్యేయం అని సీఎం కేసీఆర్ ఎప్పటికీ చెబుతారని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న 7 చర్చిలకు నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మరోవైపు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో ఏసుప్రభు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నాలుగున్నర గంటలకే ప్రాతఃకాల ప్రార్థనతో శిలువ ఊరేగింపు గా తీసుకువచ్చి చర్చిలోని ప్రధాన వేదిక మీద ప్రతిష్టించాక క్రిస్మస్ వేడుకలు ప్రారంభం అయ్యాయి. చర్చికి హాజరైన లక్షలాది మంది భక్తులకు రైట్ రెవరెండ్ ఏసీ బిషప్ సాల్మన్‌రాజు దైవ సందేశాన్ని అందించారు. ఉదయం 10 గంటలకు సెకండ్ సర్వీస్ అయ్యాక భక్తులందరిని చర్చి దర్శనానికి అనుమతిస్తారు… రాత్రి 9 గంటల వరకు చర్చ్ తెరిచి ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు దీవెనలు అందించేందుకు 15 మంది గురువులు అందుబాటులో ఉన్నారు.
Read Also: India’s Cuisine: ప్రపంచంలో అత్యుత్తమ వంటకాల జాబితాలో భారత్‌కు ఐదోస్థానం
చర్చ్ ఆప్ సౌత్ ఇండియా మెదక్ డయాసిస్ పరిధిలోని 13 జిల్లాలతోపాటు, పొరుగు రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఆంధ్రప్రదేశ్, రాష్టాల నుండి భక్తులు తరలివచ్చారు సుమారు లక్ష మంది భక్తులు మెదక్ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకలను తిలకించేందుకు తరలివచ్చారు. పూర్తిగా రాతితో నిర్మించబడి ఎత్తైన చర్చ్ మెయిన్ టవర్, కమాన్ లను, ప్రాంగణాన్ని కలర్ ఫుల్ గా డెకరేట్ చేశారు. చర్చిలో బిషప్, గురువులు కూర్చుండే ప్రధాన వేదికను, మెయిన్ హాలును రంగు రంగుల సీరియల్ బల్బ్ లు, మెరుపు కాగితాలు, బెలూన్ లు, స్టార్లతో అందంగాడెకరేట్ చేశారు. చర్చి ప్రాంగణంలోభారీ సైజు క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. అలాగే క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని భక్తుల కళ్లకు కట్టేలా పశువుల పాకను ఏర్పాటు చేశారు.
మరోవైపు రేపు జరగబోయే చర్చి వేడుకలకు పోలీస్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తులను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ఇందిరా ప్రియదర్శిని తెలిపారు చర్చ్ ప్రాంగణంలో ప్రతి ప్రతి ఏరియా సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని ఆవరణ మొత్తం పోలీస్ దిగాలో ఉంటుందని ఆమె తెలిపారు ప్రతి ఒక్క పోలీస్ తన శైలిలో ఉద్యోగాలు చేసుకొని చర్చి కాంపౌండ్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.