Site icon NTV Telugu

Harish Rao : ప్రజాస్వామ్యం బలపడాలంటే అందరూ ఓటింగ్ లో పాల్గొనాలి

Harish Rao

Harish Rao

లోక్‌ సభ ఎన్నికలకు నేడు తెలంగాణలో పోలింగ్‌ జరుగుతోంది. 17 లోక్‌ సభ స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. యావత్తు తెలంగాణ మొత్తం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే.. సిద్దిపేటలోని భరత్ నగర్ అంబిటాస్ స్కూల్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు.

 

ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. గతంలో కంటే ఎక్కువ శాతం పట్టణాలలో పోలింగ్ పెరుగుతుందన్నారు. ప్రశ్నించే గొంతుక ఉండాలని ప్రజలు ఆలోచిస్తున్నారని, మేధావులు, విద్యావంతులు పోలింగ్ లో పాల్గొనాలన్నారు హరీష్‌ రావు అన్నారు. ప్రజాస్వామ్యం బలపడలంటే అందురు ఓటింగ్ లో పాల్గొనాలని, గత పార్లమెంటు ఎన్నికలలో కంటే పోలింగ్ శాతం పెరుగుతుందన్నారు హరీష్‌ రావు.

Exit mobile version