Harirama Jogaiah Letter: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధినాయకులకో విజ్ఞప్తి అంటూ.. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ఓ లేఖ రాశారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులును బ్రిటిష్ కాలంలోనే బీసీ కులస్తులుగా పరిగణించారని పేర్కొన్నారు. ఒక్క దామోదర సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మినహా.. మిగిలిన అగ్రకులస్తులు సీఎంగా ఉన్న రోజుల్లో బీసీ జాబితా నుండి తొలగించారన్నారు. 25 శాతం జనాభా ఉన్న కాపు కులస్తులను నమ్ముకుని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉన్నాయని హరిరామ జోగయ్య అన్నారు.
‘కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులును బ్రిటిష్ కాలంలోనే బీసీ కులస్తులుగా పరిగణించారు. ఒక్క దామోదర సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మినహా.. మిగిలిన అగ్రకులస్తులు సీఎంలుగా ఉన్న రోజుల్లో బీసీ జాబితా నుండి తొలగించారు. 25 శాతం జనాభా ఉన్న కాపు కులస్తులను నమ్ముకుని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉంది. ఉమ్మడి మేనిఫెస్టోలో క్రింద ఉదాహరించిన సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ హామీ ఇవ్వాలి’ అని చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు.
Also Read: Maganti Babu: ముఖ పరిచయం లేని వ్యక్తిని.. చరిత్ర కలిగిన ఏలూరులో ఎలా నిలబెడతారు?: మాగంటి బాబు
‘బీసీలతో సమానంగా సంక్షేమ సౌకర్యాలు అందజేయాలి. జనాభా ప్రాతిపదికన కాపు కార్పొరేషన్‌కు సంక్షేమ బడ్జెట్ కేటాయించాలి. వృద్ధాప్య పెన్షన్ పరిమితి 50 సంవత్సరాలకు కుదించాలి. జనాభా ప్రాతిపాదికన విద్య, ఉద్యోగ, రాజకీయ పదవుల్లో రిజర్వేషన్ కలుగజేయాలి. వృద్ధాప్య పెన్షన్ 3000 నుండి 4000 వేల రూపాయలకు పెంచాలి. పెళ్లి ఖర్చు నిమిత్తం పెళ్లి కానుకగా లక్ష రూపాయలు ఇవ్వాలి. 18 సంవత్సరాల నుండి 49 సంవత్సరాల వయసు ఉన్న మహిళలకు కాపు నేస్తం 16 వేల రూపాయలు ఇవ్వాలి’ అని హరిరామ జోగయ్య లేఖలో డిమాండ్ చేశారు.