టాలీవుడ్ బ్యూటిఫుల్ సింగర్ హారిక నారాయణ్ గురించి అందరికి తెలిసే ఉంటుంది.. ఎన్నో సినిమాలకు తన గొంతును అందించింది..తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన ఈ భామ సినిమాల్లో సాంగ్స్ తో మెప్పిస్తునే టీవీ షోలలో, ప్రైవేట్ ఆల్బమ్స్ తో కూడా తన పాటలతో మెప్పిస్తుంది.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తన లేటెస్ట్ పాటల గురించి మాత్రమే కాదు.. లేటెస్ట్ ఫోటోలను కూడా షేర్ చేస్తుంది. తాజాగా ఈమె నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఇక హారిక నారాయణ్ గత ఏడేళ్లుగా ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది. పృథ్వినాథ్ వెంపటి అనే వ్యక్తితో హారిక ప్రేమలో ఉంది. తాజాగా వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థంకి సంబంధించిన ఫోటో ఒకటి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మనది మర్చిపోలేని బంధం.. ఏడేళ్లు ప్రేమను ఆస్వాదించాము.. ఇప్పుడు మరో లెవల్ కు తీసుకెళ్తున్నాం.. అని స్పెషల్ పోస్ట్ చేసింది. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని సమాచారం..
కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్న ఈమె ఎన్నో అద్భుతమైన పాటలను పాడింది.. ఇక హారికకు హీరో మహేశ్‌బాబు అంటే మాటల్లో చెప్పలేనంత అభిమానం. ఆయన్ను దగ్గర నుంచి చూడొచ్చనే ఓ సినిమాలో నటించినట్లు గతంలో హారిక తెలిపారు. తన అభిమాన హీరో సినిమా అయిన ‘సర్కారువారి పాట’లో టైటిల్ ట్రాక్ పాడి దుమ్మురేపారు.. ఆ పాట బాగా హిట్ అయ్యింది..