Harihara Veeramallu : మూవీ రిలీజ్ పై ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన నిర్మాత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ మూవీ `హరిహర వీరమల్లు`. ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో మొదలైనా కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. అయితే చిత్రానికి సంబంధించి ఇటీవల పవన్ పుట్టిన రోజు సందర్బంగా కొత్త లుక్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.దీంతో సినిమా షూటింగ్ త్వరలోనే మళ్ళీ స్టార్ట్ కాబోతున్నట్లు చిత్ర యూనిట్ హింట్ ఇచ్చింది.ఈ నేపథ్యంలో ఈ మూవీ కి సంబంధించి తాజాగా ఓ సర్ప్రైజింగ్ అప్డేట్ ఇచ్చారు నిర్మాత ఏఎం రత్నం. సినిమా షూటింగ్, రిలీజ్‌కి సంబంధించిన విషయంలో ఆయన క్లారిటీ ఇచ్చారు.తాజాగా ఆయన `రూల్స్ రంజాన్` చిత్ర విడుదల తేదీ ప్రకటన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. `హరిహర వీరమల్లు` సినిమా గురించి అప్డేట్ అడుగగా ఆయన ఎట్టకేలకు నోరు విప్పారు.
ఈ సినిమా భారీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతుంది అని ఆయన తెలిపారు.ఇది ఒక పీరియడ్ సినిమా అని భారీ సెట్స్, కాస్ట్యూమ్స్ తో కూడుకుని ఉంటుంది. అయితే పవన్ ప్రస్తుత బిజీ షెడ్యూల్ గురించి అందరికి తెలిసిందే. ఓ వైపు పాలిటిక్స్ అలాగే మరోవైపు సినిమాలు చేస్తున్నారు.. కాబట్టి కచ్చితంగా `హరిహర వీరమల్లు` సినిమాను పూర్తి చేసి తీరుతారు అని నిర్మాత ఏ ఎం రత్నం తెలిపారు.ఈ సందర్భంగా షూటింగ్ అప్డేట్ అలాగే విడుదల విషయం గురించి కూడా ఆయన వెల్లడించారు. పవన్ పాలిటిక్స్ బిజీ నేపథ్యంలో త్వరగా పూర్తయ్యే సినిమాలను ఆయన చేస్తున్నారు, అందుకే రీమేక్‌లు చేస్తున్నారని కూడా తెలిపారు. అదే సమయంలో తమ సినిమా షూటింగ్ కూడా జరుపబోతున్నామని ఆయన తెలిపారు. ఈ ఏడాది చివరి కల్లా `హరిహర వీరమల్లు` షూటింగ్‌ని పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.. వచ్చే ఏడాది ఏపీ ఎలక్షన్ల కన్నా ముందే తమ సినిమాని రిలీజ్ చేస్తామని ఆయన ప్రకటించారు., ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదని కూడా అన్నారు. ఈ ఒక్క మాటతో ఫ్యాన్స్ ఎంతో సంతోషించారు
Also Read
- PM SVANidhi Scheme: కేంద్రం గుడ్‌న్యూస్.. ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు హామీలేని రుణాలు..
- AP High Court: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం.. మూడేళ్లయినా దర్యాప్తు పూర్తి చేయరా..?
- నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
- Indian Cricketers: ధావన్ నుంచి బుమ్రా వరకు.. భర్త కంటే భార్యే పెద్ద.. భారత క్రికెట్లో ఈ స్టార్ జంటల ప్రేమకథలు తెలుసా?
తాజావార్తలు
-
PM SVANidhi Scheme: కేంద్రం గుడ్‌న్యూస్.. ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు హామీలేని రుణాలు..
-
Vishwanath & Sons pre-release business : విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. రిలీజ్‌కు ముందే లాభాలు
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
AP High Court: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం.. మూడేళ్లయినా దర్యాప్తు పూర్తి చేయరా..?
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
ట్రెండింగ్
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?