Site icon NTV Telugu

బన్నీ కోసం.. 15 రోజులు అన్నం మానేశా : హరితేజ

Hariteja

Hariteja

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనతో ఒక్క సీన్‌లో కనిపించినా చాలని ఎంతో మంది నటీనటులు తపిస్తుంటారు. ఇదే క్రమంలో నటి హరితేజ, ‘దువ్వాడ జగన్నాథమ్’ (DJ) సినిమా షూటింగ్ సమయంలో బన్నీ పక్కన స్లిమ్‌గా కనిపించడం కోసం తాను పడ్డ కష్టాన్ని, ఆ తర్వాత ఎదురైన మధుర అనుభూతిని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

Also Read : Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి మోహన్ బాబు లుక్ వైరల్!

హరితేజ మాట్లాడుతూ.. ‘డీజే సినిమాలో అల్లు అర్జున్ పక్కన నటించే అవకాశం వచ్చినప్పుడు నా సంతోషానికి హద్దులు లేవు. ఆయన పక్కన నేను స్లిమ్‌గా, పర్‌ఫెక్ట్‌గా కనిపించాలని ఏకంగా 15 రోజుల పాటు కేవలం లిక్విడ్ డైట్ చేశాను. షూటింగ్‌కు ముందు రోజు అసలు నిద్ర కూడా పట్టలేదు. సెట్‌లోకి వెళ్ళాక బన్నీ నేరుగా నా దగ్గరకు వచ్చి.. ‘బిగ్ బాస్‌లో నీ పెర్ఫార్మెన్స్ చూశాను, నీ వర్క్ నాకు చాలా నచ్చింది’ అని చెప్పారు. ఆ మాట వినగానే నేను ఆకాశంలో విహరిస్తున్నట్లు అనిపించింది’ అని ఎమోషనల్ అయ్యారు. అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో ఒక చిన్న నటి పనిని గుర్తుంచుకుని అభినందించడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని అభిమానులు కొనియాడుతున్నారు. హరితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు టెలివిజన్ షోలలోనూ బిజీగా గడుపుతున్నారు. ఆమె పంచుకున్న ఈ ‘డీజే’ జ్ఞాపకాలు ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ గ్రూపుల్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Exit mobile version