NTV Telugu Site icon

Rathnam : రక్తపాతంతో హరి మార్క్ ‘రత్నం’.. ట్రైలర్ అదిరింది పో!

Whatsapp Image 2024 04 15 At 5.35.54 Pm

Whatsapp Image 2024 04 15 At 5.35.54 Pm

తమిళ్ స్టార్ హీరో విశాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ  ‘రత్నం’ ఈ సినిమాకు సింగం సిరీస్ ఫేమ్ హరి దర్శకత్వం వహిస్తున్నాడు.. గతంలో వీరిద్దరి కాంబోలో భరణి, పూజ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి.. ఇప్పుడు రాబోయే రత్నం మూవీపై కూడా భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ మూవీని స్టోన్‌బెంచ్‌ ఫిల్మ్స్‌ మరియు జీ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈ చిత్రానికి కార్తికేయన్‌ సంతానం నిర్మాతగా వ్యవహారిస్తున్నారు.. రీసెంట్‌గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేశారు…ఫస్ట్ లుక్ లో విశాల్ పక్కా మాస్ మాస్‌ అవతారంలో కనిపించి ఆకట్టుకుంటున్నాడు.

ఇక ఈ సినిమాను తెలుగు మరియు తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ మూవీ నుంచి తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.తాజాగా విడుదల చేసిన ట్రైలర్ అదిరిపోయింది.ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు బోర్డర్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కించగా.. ఈ మూవీ ట్రైలర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్‌గా సాగింది. ఈ మూవీలో సముద్రఖని, యోగిబాబు మరియు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ తదితరులు నటిస్తున్నారు.ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. విశాల్‌ గతంలో నటించిన యాక్షన్‌ చిత్రాలకు పూర్తి భిన్నంగా రత్నం మూవీ తెరకెక్కినట్లు సమాచారం..యాక్షన్ చిత్రాలకు పేరు గాంచిన దర్శకుడు హరి ఈ చిత్రాన్ని తనదైన శైలిలో మరింత ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు తెలిపారు..

Show comments