Site icon NTV Telugu

Hari Hara Veera Mallu : పండుగకి స్పెషల్ ప్రోమో రిలీజ్ చేయనున్న మేకర్స్..?

Whatsapp Image 2024 02 18 At 10.43.07 Pm

Whatsapp Image 2024 02 18 At 10.43.07 Pm

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం ఆగిపోయింది అంటూ ఆ మధ్య పుకార్లు చక్కర్లు కొట్టాయి.దీనితో చిత్ర యూనిట్  ఇటీవల స్పందించింది.ఈ చిత్రం వీఎఫ్‍ఎక్స్ పనులు జరుగుతున్నాయని తెలిపింది. నాలుగేళ్ల క్రితం మొదలైన హరిహర వీరమల్లు సినిమా క్యాన్సిల్ కాలేదని సంకేతాలు ఇస్తూనే.. త్వరలోనే స్పెషల్ ప్రోమో తీసుకొస్తామని మెగా సూర్య ప్రొడక్షన్స్ తెలిపింది. అయితే, ఈ ప్రోమో ఎప్పుడు రానుందో తాజాగా ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.హరిహర వీరమల్లు సినిమా ప్రత్యేక ప్రోమో మహా శివరాత్రి అయిన మార్చి 8వ తేదీన రానుందని తెలుస్తోంది. ఆ పర్వదినాన ప్రోమోను తీసుకురావాలని మూవీ టీమ్ భావిస్తోందని సమాచారం.అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మార్చి 8న ప్రోమో వస్తోందంటూ సోషల్ మీడియాలోనూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 2020 సెప్టెంబర్‌లో హరిహర వీరమల్లు షూటింగ్ మొదలైంది. అయితే, ఆ తర్వాత కరోనా ప్రభావంతో చిత్ర షూటింగ్ నిలిచిపోయింది. ఆ తరువాత వివిధ కారణాలతో ఈ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వస్తోంది. పవన్ కల్యాణ్ ఇతర చిత్రాలకు డేట్లు కేటాయించడం, రాజకీయంగా బిజీ కావడంతో హరిహర వీరమల్లు మూవీ హోల్డ్ లో పడింది. ఆశించిన స్థాయిలో షూటింగ్ జరగలేదు.హరిహర వీరమల్లు సినిమా నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నారని ఇటీవల పుకార్లు వచ్చాయి. దీంతో ఈ చిత్రం క్యాన్సిల్ అవుతుందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ తరుణంలో వీఎఫ్‍ఎక్స్ పనులు సాగుతున్నాయని మూవీ టీమ్ చెప్పింది. ఈ చిత్రం వస్తుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.హరిహర వీరమల్లు చిత్రం డైరెక్టర్ గా క్రిష్ ఉన్నారా లేదా అనే విషయం త్వరలో రానున్న స్పెషల్ ప్రోమోతో స్పష్టమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే, ఈ సినిమా రిలీజ్ ఎప్పుడనే విషయం కూడా సస్పెన్స్‌గానే ఉంది. ఈ విషయంపై కూడా ప్రోమోలో మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చేలా కనిపిస్తోంది

Exit mobile version