Site icon NTV Telugu

Hari Hara Veera Mallu: అఫిషియల్.. హరిహర వీరమల్లు ప్రీ-రిలీజ్ ఈవెంట్ అతిథులు వీళ్లే..!

Hari Hara Veera Mallu Pre Release

Hari Hara Veera Mallu Pre Release

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు పార్ట్ 1 (స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్) జూలై 24న థియేటర్లలో విడుదలకు సిద్ధం అయ్యింది. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో జ్యోతి క్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ఈ సినిమా విడుదలకు ఎట్టకేలకు సమయం దగ్గరపడింది. ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని జూలై 24న తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు చిత్ర బృందం.

Read Also:Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లును టార్గెట్ చేస్తున్నారు.. ఏఎం రత్నం షాకింగ్ కామెంట్స్

ఇక సినిమాపై ఉన్న హైప్ నేపథ్యంలో.. నిర్మాత ఏఎం రత్నం ఒక పెద్ద సర్ప్రైజ్‌ ప్రకటించారు. జూలై 23 రాత్రి 9:30 గంటలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల అనుమతులు, అలాగే టికెట్ ధరల పెంపు కోసం కూడా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. సినిమా విడుదలకు ముందు జూలై 21న హైదరాబాద్‌ లోని శిల్పకళా వేదికలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగనుందని తెలిపారు.

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ పెంపుకు పచ్చజెండా?

అంతేకాకుండా ఈ వేడుకకు ఎస్‌ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే, అలాగే మరికొందరు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అభిమానులు, పరిశ్రమలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఈవెంట్ సినిమాపై హైప్‌ను మరింత పెంచనుందని ఆయన అన్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌తో పాటు నిధి అగర్వాల్, బాబీ డోయల్, సత్యరాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ. దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రానికి సంగీతాన్ని ఎమ్.ఎమ్. కీరవాణి అందించారు. ఈ సినిమాతో పవన్ కల్యాణ్ మళ్లీ తెరపై దర్శనమివ్వబోతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరింది. ప్రీమియర్ షోలు, స్టార్ ఈవెంట్లు లాంటి కార్యక్రమాలు అన్ని కలసి హరిహర వీరమల్లు సినిమా కోసం ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తున్నాయి.

Exit mobile version