NTV Telugu Site icon

Pawan Kalyan : పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. తన గాత్రంతో కొత్త ఏడాదికి వెల్ కమ్ చెప్పనున్న పవన్

New Project 2024 12 27t115200.196

New Project 2024 12 27t115200.196

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఆయన గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. జనసేన తరఫున 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బరిలోకి దిగితే 21 మంది గెలిచారు. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక ఆయన సినిమాలకు సంబంధించి అప్డేట్స్ కూడా ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. దసరా పండుగ సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి ఒక పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Read Also:Jagga Reddy: ఎంత ఎదిగినా ఎలా ఒదిగి ఉండాలో చాటి చెప్పిన మహనీయుడు మన్మోహన్ సింగ్

ఆ పోస్టర్లో పవన్ విల్లు ధరించి బాణాలు ఎక్కిపెట్టి కనిపిస్తున్నారు. ఇక త్వరలోనే హరిహర వీరమల్లు ఫస్ట్ పాటని రిలీజ్ చేయబోతున్నామని ఆ పాటని పవన్ కళ్యాణ్ పాడారని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి తొలుత క్రిష్ డైరెక్టర్గా వ్యవహరించారు. సినిమా వాయిదా పడుతూ వస్తూ ఉండడంతో ఆయన దర్శకత్వ బాధ్యతలు నుంచి తప్పుకోవడంతో నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. అయితే షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిన ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అనేది కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ ఈ కొత్త ఏడాది ఆరంభంలో రానుందని తెలుస్తోంది. జనవరి 1 ఆరంభం తోనే పవన్ పాడిన ఈ స్పెషల్ సాంగ్ ని మేకర్స్ రాత్రి 12 గంటలకి విడుదల చేయనున్నారట. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించగా ఏ ఎం రత్నం నిర్మాణం వహిస్తున్నారు. ఇక సినిమాని వచ్చే ఏడాది మార్చి 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు.

Read Also:Sruthi Hasan : నాకు పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదు.. ఇంత వైరాగ్యం ఎందుకొచ్చింది శృతి

Show comments