Site icon NTV Telugu

Hardik Pandya: ఏఎంబీ మాల్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ సందడి..

Hardik Pandya

Hardik Pandya

Hardik Pandya: చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ స్టార్ హీరో ఈ ప్రాజెక్ట్‌తో బీజీగా ఉన్నారు. ఈ స్టార్ హీరోకు ఫేమస్ మల్టీప్లెక్స్ ఉన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఏఎంబీ సినిమాస్ అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.

టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తాజాగా ఈ ఏఎంబీ మాల్‌లో సందడి చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. అది సూపర్ స్టార్ మహేష్ బాబు థియేటర్ కావడం, అందులోనూ అక్కడికి స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వచ్చి సందడి చేయడంతో ఇప్పుడు నెట్టింగ తెగ వైరల్ అవుతున్నాయి. సినిమా, క్రీడా ప్రపంచానికి చెందిన స్టార్‌ల అభిమానులకు ఈ పోటోలు ఎప్పటికీ ప్రత్యేక క్షణంగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Exit mobile version