Indian Fans Brutally Trolled Team India Captain Hardik Pandya: వెస్టిండీస్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల సిరీస్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లో ఆకట్టుకుంది. మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిన హార్దిక్ సేన మూడో టీ20 మ్యాచ్‌లో సునాయాస విజయం అందుకుంది. వెస్టిండీస్ నిర్దేశించిన 160 పరుగుల టార్గెట్‌ను భారత్ 17.5 ఓవర్లలోనే మూడు వికెట్స్ మాత్రమే కోల్పోయి ఛేదించి గెలిచింది. సూర్యకుమార్ యాదవ్ (83) హాఫ్ సెంచరీతో మెరవగా.. తిలక్ వర్మ (49 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే కెప్టెన్ హార్దిక్ పాండ్యా సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించడమే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశం అయింది.
భారత్ విజయానికి 14 బంతుల్లో కేవలం 2 పరుగులు అవసరం అయ్యాయి. ఈ సమయంలో హార్దిక్ పాండ్యా స్ట్రైక్‌లో ఉండగా.. నాన్ స్ట్రైక్ ఎండ్‌లో తిలక్ వర్మ 49 పరుగులతో ఉన్నాడు. ఒక్క పరుగు చేస్తే తిలక్ ఖాతాలో మరో హాఫ్ సెంచరీ చేరేది. ఆ ఓవర్‌లో ఇంకా రెండు బంతులు మిగిలిండడంతో.. హార్దిక్ సింగిల్ తీసి తిలక్‌కు స్ట్రైక్ ఇస్తాడని అంతా భావించారు. తిలక్ ఇంకో హాఫ్ సెంచరీ చేస్తాడని కామెంటేటర్‌లు కూడా అన్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా హార్దిక్ సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ముగించేశాడు. దీంతో తిలక్ 49 పరుగులతో ఉండిపోవాల్సి వచ్చింది.
హార్దిక్ పాండ్యా సిక్స్‌తో మ్యాచ్ ఫినిష్ చేయడంతో భారత ఫాన్స్, నెటిజన్లు అతడిని తప్పుబడుతున్నారు. హార్దిక్ పాండ్యాకు ఇంత స్వార్ధమా, నాయకత్వ లక్షణాలు అంటే ఇవేనా, కాస్త ఎంఎస్ ధోనీని చూసి నేర్చుకో అంటూ ట్రోలు చేస్తున్నారు. గతంలో నాన్‌స్ట్రైక్‌లో ఉన్న బాట్లర్లు ఏదైనా మైలురాయికి దగ్గరగా ఉన్నప్పుడు.. ఎంఎస్ ధోనీ ఢిఫెన్స్ ఆడి వారికి స్ట్రైక్ ఇచ్చేవాడు. దాంతో వారు వారి మైలురాయికి పూర్తిచేసేవారు.
Also Read: Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో రెండో ఆటగాడిగా..!
అంతేకాదు రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలో 20 ఏళ్ల కిందట చోటు చేసుకున్న సంఘటనను కూడా గుర్తు చేస్తున్నారు. 2001/02 సీజన్‌లో దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 194 పరుగుల వద్ద ఉన్నప్పుడు ద్రవిడ్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేశాడు. దాంతో అప్పట్లో ద్రవిడ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ మ్యాచ్‌లోనే వీరేంద్ర సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Most Punchable Face Right now!
Hardik Pandya is the most SELFISH Player i have ever seen!
Oh Tilak 💔 pic.twitter.com/abNhCAP73a
— ᴘʀᴀᴛʜᴍᴇsʜ⁴⁵ (@45Fan_Prathmesh) August 8, 2023