NTV Telugu Site icon

ICC T20 Rankings: నెంబర్-1 ఆల్ రౌండర్‌గా టీమిండియా స్టార్ క్రికెటర్..

Hardik

Hardik

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం టీ20 ఆటగాళ్ల తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ తర్వాత భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నెంబర్-1 స్థానంలోకి అడుగుపెట్టాడు. హార్దిక్ మరోసారి టీ20 ఆల్‌రౌండర్‌గా నంబర్‌వన్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌కు చెందిన లియామ్ లివింగ్‌స్టోన్, నేపాల్‌కు చెందిన దీపేంద్ర సింగ్ ఐరీలను వెనక్కినెట్టి నెంబర్ వన్‌కు ఎగబాకాడు. హార్దిక్ ప్రస్తుతం 244 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు. లివింగ్‌స్టోన్ 230 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు. దీపేంద్ర సింగ్ ఐరీ (230) రెండో స్థానంలో ఉన్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో హార్దిక్ 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ సిరీస్‌లో రెండు వికెట్లు తీశాడు. భారత్ 3-1తో సిరీస్‌ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే..

Winter: శీతాకాలంలో వ్యాయామం ఎలా చేయాలంటే..!

మరోవైపు.. బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో యువ క్రికెటర్ తిలక్ వర్మ 69 స్థానాలు ఎగబాకి టాప్ 10లోకి వచ్చాడు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బాబర్ ఆజంలను అధిగమించి మూడో స్థానానికి చేరుకున్నాడు. తిలక్ ఖాతాలో 806 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో, నాలుగో టీ20లో అతను అజేయ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ 280 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. సూర్య 788 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. బాబర్ (742)ఐదవ స్థానంలో ఉన్నాడు. వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ కూడా 17 స్థానాలు ఎగబాకి 22వ స్థానానికి చేరుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి, నాలుగో మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించాడు. మరోవైపు.. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ట్రిస్టన్ స్టబ్స్ (మూడు స్థానాలు ఎగబాకి 23వ ర్యాంక్‌), హెన్రిచ్ క్లాసెన్ (ఆరు స్థానాలు ఎగబాకి 59వ ర్యాంక్‌) ఉన్నారు. శ్రీలంక బ్యాట్స్‌మెన్ కుశాల్ మెండిస్ (మూడు స్థానాలు ఎగబాకి 12వ ర్యాంక్‌), వెస్టిండీస్‌కు చెందిన షాయ్ హోప్ (16 స్థానాలు ఎగబాకి 21వ ర్యాంక్‌), ఆస్ట్రేలియాకు చెందిన మార్కస్ స్టోయినిస్ (10 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంక్‌) వచ్చారు. ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్ (855) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Ram Charan: రామ్ చరణ్పై విమర్శలకు ఉపాసన కౌంటర్

టీ20 బౌలర్ల ర్యాంకింగ్‌లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. ఆస్ట్రేలియా బౌలర్లు ఆడమ్ జంపా (693), నాథన్ ఎల్లిస్ (628) వరుసగా మూడు, 11వ స్థానాల్లో నిలిచారు. ఇటీవలే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాకిస్థాన్‌ను ఆస్ట్రేలియా వైట్‌వాష్ చేసింది. భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ (656) మూడు స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు. దక్షిణాఫ్రికాపై అతని ప్రదర్శన ఆధారంగా, అతను తన కెరీర్‌లో కొత్త అత్యధిక రేటింగ్‌ను సాధించాడు. దక్షిణాఫ్రికాపై అర్ష్‌దీప్‌ ఎనిమిది వికెట్లు తీశాడు. టాప్-10లో భారత్‌ బౌలర్లు ఇద్దరు ఉన్నారు. స్పిన్నర్ రవి బిష్ణోయ్ (666) ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ (701) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతని తర్వాత వనిందు హసరంగా (696) ఉన్నాడు.