Site icon NTV Telugu

Hardik Pandya: నువ్వు సూపర్ బ్రో.. మంచి మనసు చాటుకున్న హార్దిక్..

Hardik Pandya

Hardik Pandya

Hardik Pandya Wins Hearts: దక్షిణాఫ్రికాతో అహ్మదాబాద్‌లో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా తన ఆటతోనే కాదు.. తన మంచి మనసుతోనూ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. మ్యాచ్ సమయంలో హార్దిక్ కొట్టిన భారీ సిక్సుల్లో ఒకటి కెమెరామెన్‌ను తాకింది. దీంతో మ్యాచ్ చివరి బంతి పూర్తవగానే హార్దిక్ వెంటనే అక్కడికి వెళ్లి కెమెరామెన్ పరిస్థితి తెలుసుకున్నాడు. ఓదార్చుతూ ఆప్యాయంగా హగ్ చేసుకున్నాడు. అంతేకాదు, బంతి తగిలిన ఎడమ భుజంపై ఐస్ ప్యాక్ పెట్టి స్వయంగా సహాయం చేశాడు. హార్దిక్ బలంగా కొట్టడంతో బంతి నేరుగా స్టేడియంలో ఉన్న డగౌట్ పక్కన కెమెరా పెట్టుకున్న వ్యక్తివైపు వెళ్లింది. ఆ వ్యక్తికి బలంగా తిగిలింది. దీంతో కొద్దిసేపు ఆట నిలిచిపోయింది. వెంటనే వైద్యులు రంగంలోకి దిగి చికిత్స చేశారు. అనంతరం.. ఆ కెమెరామెన్ మళ్లీ తన విధులను కొనసాగించాడు.

READ MORE: Madhavi Murder Case: భార్యను ముక్కలు చేసి ఉడకబెట్టిన కేసులో బిగ్‌ట్విస్ట్.. మరదలుతో భర్తకు ఎఫైర్!

ఈ మ్యాచ్‌లో భారత్ 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించగా, ఆ విజయంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. 13వ ఓవర్లో భారత్ 115 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్, తొలి బంతి సిక్స్ బాదాడు. అతని ఆత్మవిశ్వాసం, స్టైల్ అందరినీ ఆకట్టుకున్నాయి. హార్దిక్ కేవలం 16 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి, టీ20ల్లో భారత ఆటగాళ్లలో రెండో వేగవంతమైన ఫిఫ్టీ నమోదు చేశాడు. చివరికి 25 బంతుల్లో 63 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తిలక్ వర్మతో కలిసి కేవలం 45 బంతుల్లో 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తిలక్ వర్మ 73 పరుగులు చేయగా, వారి జోడి భారత్‌ను 231 పరుగుల భారీ స్కోరుకు చేర్చింది.

READ MORE: Adivi Sesh : పీఆర్ ట్యాగ్‌లకు నో చెప్పిన అడివి శేష్..

Exit mobile version