Hardik Pandya Watch: పాండ్య వాచ్ ధర ముందు.. పాక్ కెప్టెన్ జీతం కూడా దిగదుడుపే!

Hardik Pandya

Hardik Pandya

Hardik Pandya Watch: భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో, మైదానం బయట తన స్టైల్‌తోనూ అంతే సందడి చేస్తుంటాడు. తాజాగా జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో హార్దిక్ తన బౌలింగ్‌తో ప్రత్యర్థిని దెబ్బతీయడమే కాకుండా, తన చేతి గడియారంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు. మహాశివరాత్రి పర్వదినం రోజున జరిగిన ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య ధరించిన వాచ్‌ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దీని ప్రత్యేకత ఏంటంటే.. దాని డిస్‌ప్లేపై ధ్యానంలో ఉన్న పరమశివుడి (రుద్రుడు) ఆకృతి ఉంటుంది.

READ ALSO: Privilege Notice: ఢిల్లీలో ప్రకంపనలు.. మోదీ, ఓం బిర్లాపై AI వీడియోలు.. 9 మంది కాంగ్రెస్ నేతలకు నోటీసులు.!

శివుడి రూపంలో ‘రుద్ర’ ఎడిషన్ ప్రత్యేకతలు ఇవే!

బ్రాండ్: లగ్జరీ వాచ్ మేకర్ ‘జాకబ్ అండ్ కో’ (Jacob & Co).

మోడల్: ఎపిక్ ఎక్స్ స్పోర్ట్ ‘రుద్ర’ ఎడిషన్ (Epic X Sport ‘Rudra’ Edition).

ప్రత్యేకత: ఈ మోడల్‌లో ప్రపంచవ్యాప్తంగా కేవలం 25 వాచీలు మాత్రమే తయారు చేశారు. ఇవి కేవలం కంపెనీకి అత్యంత సన్నిహితులైన వారికి మాత్రమే దక్కుతాయి.

ధర వింటే షాక్ అవ్వాల్సిందే..!
ఈ లిమిటెడ్ ఎడిషన్ వాచ్ ధర దాదాపు రూ. 25 లక్షల పైమాటే అని అంచనా. ఒక ఆసక్తికరమైన పోలిక ఏమిటంటే.. పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా నెలవారీ జీతం కంటే ఇది దాదాపు మూడున్నర రెట్లు ఎక్కువ అని సమాచారం. పాక్ క్రికెట్ బోర్డ్ (PCB) సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకారం, కెప్టెన్‌కు నెలకు సుమారు రూ. 7 లక్షల వరకు జీతం అందుతుంది. అంటే పాక్ కెప్టెన్ మూడు నెలల జీతం పెట్టినా, హార్దిక్ ధరించిన ఈ ఒక్క వాచ్‌ ఖరీదుతో సరిపోదని నెట్టింట జోరుగా చర్చించుకుంటున్నారు.

ఈ వాచ్‌లోని అదిరిపోయే ఫీచర్లు:
మెటీరియల్: ఇది గ్రేడ్-5 టైటానియంతో తయారైంది, ఇది చాలా తేలికగా, ధృడంగా ఉంటుంది.

డిజైన్: వాచ్ లోపలి భాగం మొత్తం కనిపించేలా ‘స్కెలిటైన్’ డిజైన్‌తో ఉంటుంది.

వాటర్ రెసిస్టెన్స్: 50 మీటర్ల లోతు వరకు నీటిలో ఉన్నా ఏమీ కాదు.

బ్యాటరీ: ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 70 గంటల పాటు నిరంతరంగా పనిచేస్తుంది.

READ ALSO: Dum Biryani: హోటల్ రుచితో చికెన్ దమ్ బిర్యానీ.. ఈజీగా కేవలం ఒక గంటలోనే ఇలా చేసేయండి!