NTV Telugu Site icon

Natasa Stankovic: బిగ్ బాస్ లోకి హార్దిక్ పాండ్యా మాజీ భార్య..?

Natasa Stankovic

Natasa Stankovic

Natasa Stankovic In Biggboss: సల్మాన్ ఖాన్ రియాల్టీ షో హింది ‘బిగ్ బాస్ 18’ కి సంబంధించి మరోసారి వార్తలు జోరందుకున్నాయి. ప్రోమో వీడియో కంటే ముందే షో సంబంధించి అనేక ఊహాగానాలు తెగ చెక్కర్లు కొడుతున్నాయి. ఈ షోలో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పాల్గొనవచ్చని కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజా అప్‌డేట్ ప్రకారం, ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్‌ను సంప్రదించరని సమాచారం. ఇకపోతే ఇప్పటివరకు కంటెస్టెంట్స్‌ పేర్లను వెల్లడించకపోవడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పుడు మేకర్స్ మరో వివాదాస్పద కంటెస్టెంట్ నటాషా స్టాంకోవిచ్‌ను సంప్రదించారు. ఇది మాత్రమే కాదు, ఆమె స్నేహితుడు అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ కూడా ఈ కార్యక్రమంలో చూడవచ్చని సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి.

నటాషాను సంప్రదించడం వెనుక కారణం..

షోలో, మేకర్స్ కొన్ని కారణాల వల్ల వివాదాలలో భాగమైన కంటెస్టెంట్‌లను మాత్రమే సంప్రదిస్తారు. షో టీఆర్‌పీ విపరీతంగా పెరగడానికి ఇదే కారణం. గతంలో రాజ్ కుంద్రా పేరు కూడా తెరపైకి వచ్చింది. అడల్ట్ ఫిల్మ్ మేకింగ్ కారణంగా రాజ్ కుంద్రా చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతేకాదు., ఆ దాని వల్ల జైలుకు కూడా వెళ్లాడు. నటాషాను సంప్రదించడానికి ఆమె వ్యక్తిగత జీవితమే కారణం కావచ్చు. ఆమె షోకి వస్తే, తన పెళ్లి జీవితంలో విడిపోవడానికి గల కారణాన్ని కూడా ఆమె టీవీలో వెల్లడించవచ్చు.

ఆ వార్తల్లో నిజం ఎంత..?

అయితే ఈ షోలో నటాషా రాకకు సంబంధించిన వార్తలను ప్రస్తుతానికి ధృవీకరించడం లేదు. మేకర్స్ లేదా నటి నుండి ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. ఈ షోకి నటాషా రాకతో చాలా పెద్ద సీక్రెట్స్ రివీల్ అవుతాయి.

Show comments