NTV Telugu Site icon

Jasmin Walia: హార్దిక్ పాండ్యాతో డేటింగ్.. ఎవరీ జాస్మిన్‌ వాలియా?

Jasmin Walia

Jasmin Walia

Who is Jasmin Walia: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా పేరు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. బ్రిటిష్‌ సింగర్‌, టీవీ నటి జాస్మిన్‌ వాలియాతో హార్దిక్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు రావడమే ఇందుకు కారణం. గ్రీస్‌లోని ఓ హోటల్ స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద నడుస్తూ తీసుకున్న వీడియోను తాజాగా హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. అదే పూల్‌ వద్ద దిగిన పోటోలను జాస్మిన్‌ కూడా పోస్ట్ చేశారు. దీంతో ఇద్దరూ కలిసే గ్రీస్‌కు వెకేషన్‌కు వెళ్లినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హార్దిక్‌తో డేటింగ్ చేస్తున్న ఈ జాస్మిన్‌ ఎవరా? అని అభిమానులు, నెటిజెన్స్ గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు.

ఇంగ్లండ్‌లోని ఎసెక్స్‌లో భారతీయ సంతతికి చెందిన పంజాబీ కుటుంబంలో 1995 మే 23న జాస్మిన్‌ వాలియా జన్మించారు. ఆమె 7-8 సంవత్సరాల వయస్సులో పాడటం ప్రారంభించారు. చిన్నప్పటినుంచి భారతీయ సంగీతాన్ని వింటూ.. బాలీవుడ్ సినిమాలు చూసేవారు. జాస్మిన్ 11 సంవత్సరాల వయస్సులో ప్రముఖ హాస్య ధారావాహిక డాక్టర్స్‌లో అరంగేట్రం చేశారు. 2010 నుంచి పలు రియాల్టీ షోల్లో పాల్గొని అభిమానులకు చేరువయ్యారు. 2014లో సొంతంగా యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించి.. పలు ఆల్బమ్‌లు చేశారు.

Also Read: Hardik Pandya Dating: సింగర్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్.. పిక్స్ వైరల్!

29 ఏళ్ల జాస్మిన్‌ వాలియా పాడిన ‘బామ్‌ డిగీ’ పాటను ఓ బాలీవుడ్‌ సినిమాలో రీమేక్‌ చేశారు. బాలీవుడ్‌కు చెందిన ఆసిమ్‌ రియాజ్‌తో కలిసి జాస్మిన్‌ ఓ మ్యూజిక్‌ వీడియో కూడా చేశారు. దమ్ డీ డీ దమ్, గర్ల్ లైక్ మి, టెంపుల్, గో డౌన్, బోమ్ డిగ్గీ లాంటి మ్యూజిక్‌ వీడియోకు చేశారు. వాంట్ సమ్ సాంగ్ ద్వారా న్యూయార్క్ నగరంలో టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డుపై కనిపించారు. ఇన్‌స్టాలో జాస్మిన్‌కు 6.4లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే హార్దిక్ పాండ్యాతో ఆమెకు ఎక్కడ పరిచయం అయిందో తెలియాల్సి ఉంది.

 

Show comments