Hardik Pandya New Relationship: భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఆటతో కాకుండా వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచారు. పాండ్యా ప్రస్తుతం టీం ఇండియా తరపున ఆసియా కప్‌లో ఆడుతున్నాడు. తాజాగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. హార్దిక్ పాండ్యా గత ఏడాది నటాషా స్టాంకోవిచ్ నుంచి విడాకులు తీసుకున్నాడు. విడాకుల తర్వాత, వాళ్లిద్దరూ వారి జీవితాల్లో ముందుకు వెళ్తున్నారు. అనంతరం పాండ్యా భారత సంతతికి చెందిన బ్రిటిష్ గాయని జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వాళ్లు విడిపోయారని సమాచారం.
READ ALSO: Supreme Court: రోగి మరణిస్తే.. డాక్టర్ బాధ్యత వహించడు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
తాజాగా రూమర్స్ ఏంటి..
హార్దిక్ జాస్మిన్ వాలియాతో విడిపోయిన తర్వాత పూర్తిగా స్థాయిలో కెరీర్‌పై ఫోకస్ చేశాడు. తాజాగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్‌లో టీం ఇండియా తరుపున బరిలో దిగిన హార్దిక్ పాండ్యా భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈసందర్భంగా పాండ్యాపై కొత్త రూమర్ ఒకటి సోషల్ మీడియాలో విశేషంగా ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం పాండ్యా.. మోడల్, నటి అయిన మహికా శర్మతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి.
రెడ్డిట్ థ్రెడ్‌లో మహికా శర్మ చేసిన పోస్ట్ ఈ పుకార్లకు బలం చేకూర్చినట్లు నెటిజన్‌లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్ట్‌లో ఆమె 33 గురించి పోస్ట్ చేసింది. హార్దిక్ జెర్సీ నంబర్ కూడా 33 కావడంతో ఈ పుకార్లు నిజం అంటూ పలువురు నెటిజన్‌లకు కామెంట్స్ చేస్తున్నారు. వీటిపై హార్దిక్ లేదా, మహికా స్పందించే వరకు ఈ పుకార్లపై క్లారిటీ రాదు.
READ ALSO: Nepal PM Election: గేమింగ్ యాప్‌లో నేపాల్ ప్రధాని ఎన్నిక.. సుశీలా కర్కీకి ఎన్ని ఓట్లు వచ్చాయంటే!
