Hardik Pandya: హార్దిక్ పాండ్యాతో విభేదాలు.. నటాషా పోస్ట్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya and Natasa Stankovic Divorce Rumours: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్య నటాషా స్టాంకోవిక్‌తో హార్దిక్‌కు విభేదాలు ఉన్నాయని ఆ వార్తల సారాంశం. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే నటాషా.. గత కొన్ని రోజులుగా హార్దిక్‌తో ఉన్న ఫొటోలు పోస్ట్ చేయకపోవడమే ఇందుకు కారణం అని ఓ అంతర్జాతీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పేర్కొంది. దాంతో హార్దిక్-నటాషాలు తమ వివాహ బంధంకు వీడ్కోలు చెప్పబోతున్నారని నెటిజెన్స్ కథలు అల్లేశారు. ఇవన్నీ వదంతులే అని హార్దిక్ ఫాన్స్ కొట్టి పారేస్తున్నారు.
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. 14 మ్యాచ్‌లలో కేవలం 4 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. కెప్టెన్‌గా మాత్రమే కాకుండా.. ఆల్‌రౌండర్‌గానూ హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడు. దాంతో అతడిపై నెట్టింట తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. టీ20 ప్రపంచకప్ 2024 భారత జట్టు నుంచి హార్దిక్‌ను తప్పించాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా ప్రభావం తన భార్యా, కుమారుడిపై కూడా పడుతుందేమోనని హార్దిక్ బయపడ్డాడట. అందుకే నటాషాను కొద్దికాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించాడట. అందుకే నటాషా స్టేడియానికి రావడం లేదట. కుమారుడు అగస్త్యను కూడా ఎక్కువగా బయటకు తీసుకురావడం లేదని తెలుస్తోంది.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
Also Read: R Ashwin: కమిట్మెంట్ ఇచ్చినప్పుడు తీవ్రంగా శ్రమించాల్సిందే!
అయితే నటాషా స్టాంకోవిక్ తాజాగా చేసిన పోస్ట్ అన్ని రూమర్లకు చెక్ పెట్టింది. నుదుటిన బొట్టుతో ఉన్న ఓ ఫొటో బుధవారం షేర్ చేశారు. ‘అతడి ప్రేమ వల్లే ఈ మెరుపు’ అంటూ పేర్కొన్నారు. దీంతో హార్దిక్-నటాషా మధ్య విభేదాలు లేవని స్పష్టం అయింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. ఐపీఎల్ 2024 నుంచి ముంబై నిష్క్రమించడంతో కొన్ని రోజులు కుటుంబంతో హార్దిక్ గడపనున్నాడు. ఆపై టీ20 ప్రపంచకప్ 2024 కోసం అమెరికా వెళ్లనున్నాడు.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!