NTV Telugu Site icon

Hardik Pandya: హార్దిక్‌ పాండ్యాతో విభేదాలు.. నటాషా పోస్ట్‌ వైరల్‌!

Hardik Pandya Natasa Stankovic

Hardik Pandya Natasa Stankovic

Hardik Pandya and Natasa Stankovic Divorce Rumours: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్య నటాషా స్టాంకోవిక్‌తో హార్దిక్‌కు విభేదాలు ఉన్నాయని ఆ వార్తల సారాంశం. సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే నటాషా.. గత కొన్ని రోజులుగా హార్దిక్‌తో ఉన్న ఫొటోలు పోస్ట్‌ చేయకపోవడమే ఇందుకు కారణం అని ఓ అంతర్జాతీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పేర్కొంది. దాంతో హార్దిక్‌-నటాషాలు తమ వివాహ బంధంకు వీడ్కోలు చెప్పబోతున్నారని నెటిజెన్స్ కథలు అల్లేశారు. ఇవన్నీ వదంతులే అని హార్దిక్ ఫాన్స్ కొట్టి పారేస్తున్నారు.

ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. 14 మ్యాచ్‌లలో కేవలం 4 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. కెప్టెన్‌గా మాత్రమే కాకుండా.. ఆల్‌రౌండర్‌గానూ హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడు. దాంతో అతడిపై నెట్టింట తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. టీ20 ప్రపంచకప్‌ 2024 భారత జట్టు నుంచి హార్దిక్‌ను తప్పించాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా ప్రభావం తన భార్యా, కుమారుడిపై కూడా పడుతుందేమోనని హార్దిక్ బయపడ్డాడట. అందుకే నటాషాను కొద్దికాలం సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని సూచించాడట. అందుకే నటాషా స్టేడియానికి రావడం లేదట. కుమారుడు అగస్త్యను కూడా ఎక్కువగా బయటకు తీసుకురావడం లేదని తెలుస్తోంది.

Also Read: R Ashwin: కమిట్‌మెంట్‌ ఇచ్చినప్పుడు తీవ్రంగా శ్రమించాల్సిందే!

అయితే నటాషా స్టాంకోవిక్‌ తాజాగా చేసిన పోస్ట్ అన్ని రూమర్లకు చెక్ పెట్టింది. నుదుటిన బొట్టుతో ఉన్న ఓ ఫొటో బుధవారం షేర్ చేశారు. ‘అతడి ప్రేమ వల్లే ఈ మెరుపు’ అంటూ పేర్కొన్నారు. దీంతో హార్దిక్‌-నటాషా మధ్య విభేదాలు లేవని స్పష్టం అయింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. ఐపీఎల్ 2024 నుంచి ముంబై నిష్క్రమించడంతో కొన్ని రోజులు కుటుంబంతో హార్దిక్ గడపనున్నాడు. ఆపై టీ20 ప్రపంచకప్ 2024 కోసం అమెరికా వెళ్లనున్నాడు.