NTV Telugu Site icon

Hardik-Natasa Divorce: హార్దిక్ పాండ్యాకు షాక్.. నటాసా స్టాంకోవిచ్‌కు 70 శాతం ఆస్తి!

Hardik Natasa

Hardik Natasa

Natasa Stankovic and Hardik Pandya Breakup Rumors: టీమిండియా స్టార్ క్రికెటర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఈసారి క్రికెట్ విషయాల్లో కాకుండా.. తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి హార్దిక్ వార్తల్లోకెక్కాడు. భార్య నటాసా స్టాంకోవిచ్‌తో అతడు విడిపోతున్నాడని నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు హార్దిక్ ఆస్తిలో 70 శాతం వాటాను నటాషా తీసుకుంటుంన్నారట. అయితే ఈ విడాకుల గురించి అటు హార్దిక్ నుంచి కానీ.. ఇటు నటాషా నుంచి కానీ ఎటువంటి అధికారిక సమాచారం లేదు.

ముంబైలోని ఓ హోటల్‌లో హార్దిక్ పాండ్యా, నటాసాకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం స్నేహంగా.. ఆ తర్వాత ప్రేమగా మారింది. 2018లో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. కొత్త సంవత్సరం 2020 వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో స్పీడ్‌ బోట్‌లో విహరిస్తూ.. నటాసాకు హార్దిక్ రింగ్ తొడిగాడు. ఆ తర్వాత ఇద్దరు డేటింగ్‌ చేశారు. అదే ఏడాది లాక్‌డౌన్‌లో తాము తల్లిదండ్రులు అయ్యామని ప్రకటించారు. 2020 జులైలో ఆగస్త్యకు వారు జన్మనిచ్చారు. అయితే పాండ్యా, నటాసాలు వివాహాన్ని మాత్రం ఆలస్యంగా చేసుకున్నారు. మొన్నటి వరకు వీరి జీవితం సాఫీగా సాగింది.

తాజాగా నటాసా తన ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్‌లో హార్దిక్ పాండ్యా పేరు తొలగించడంతో.. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని నెట్టింట ప్రచారం మొదలైంది. విడిపోతున్నారని పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే నటాసా.. కొద్దికాలం నుంచి ఇద్దరు కలిసున్న ఫొటోలు పెట్టకపోవడంతో ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. త్వరలోనే హార్దిక్, నటాసాలు విడాకులు తీసుకోబోతున్నారట. హార్దిక్ ఆస్తిలో 70 శాతం వాటాను నటాషా తీసుకుంటున్నారట. మరి ఇందులో ఎంత నిజముందో వారు స్పందిస్తే కానీ తెలిసేలా లేదు.

Also Read: Kavya Maran: ఎగిరి గంతేసిన కావ్య మారన్.. క్యూట్ సెలబ్రేషన్స్ వైరల్!

హార్దిక్ పాండ్యా కోట్ల ఆస్తికి యజమాని. ఐపీఎల్‌ మ్యాచ్ ఫీజుతో పాటు అనేక ఇండియన్ టీమ్ ఫీజు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ వ్యాపారాల ద్వారా ఆదాయం సంపాదిస్తున్నాడు. ముంబైలో 30 కోట్లతో ఓ అపార్ట్‌మెంట్ తీసుకున్నాడు. వడోదరలో ఓ పెంట్ హౌస్ ఉంది. దీని ధర కోట్లలో ఉంటుందట. ఇవి కాక ఇంకా చాలానే ఆస్థులు ఉన్నాయట. సెర్బియాలో పుట్టిన నటాసా ముంబైలో స్థిరపడ్డారు. 2013లో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసి నటాసా.. 2018లో సత్యాగ్రహ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ 8లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్నారు. పలు టీవీ కార్యక్రమాలు, వెబ్ సిరీస్‌లలో కూడా నటించారు.