Site icon NTV Telugu

GT vs LSG: అన్నదమ్ముల మధ్య పోరు.. గెలిచేది ఎవరో..

Gt Vs Lsg

Gt Vs Lsg

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ఈ రోజు జరుగనున్న మ్యాచ్ లో పాండ్యా బ్రదర్స్ తలపడనున్నారు. అహ్మదాబాద్ స్టేడియంలో ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగే ఈ మ్యా్చ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.

Also Read : Fake gang: సైబరాబాద్‌లో కల్తీ ముఠా… కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్‌

అయితే గుజరాత్ జట్టుకు సారథిగా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తుండగా.. లక్నో కు కృనాల్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. దీంతో ఈ మ్యాచ్ లో అన్నదమ్ముల మధ్య పోరుగా మనం చూడవచ్చు. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న ఈ రెండు టీమ్స్ మరోసారి బరిలోకి దిగుతున్నాయి. ఏప్రిల్ 16న జరిగిన మ్యాచ్ లో 7 పరుగుల తేడాతో లక్నో జట్టుపై గుజరాత్ టైటాన్స్ టీమ్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో పాండ్యా బ్రదర్స్ మధ్య జరుగబోయే పోరులో ఎలా అయినా విజయం సాధించి.. గుజరాత్ పై ప్రతీకారం తీర్చుకోవాలని లక్నో సూపర్ జెయింట్స్ భావిస్తుంది.

Also Read : Hare Krishna Heritage: హరే కృష్ణ హెరిటేజ్ టవర్‌.. రేపు భూమిపూజ కార్యక్రమంలో సీఎం

లక్నో రెగ్యూలర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా ప్రస్తుత ఐపీఎల్ నుంచి వైదొలిగడంతో టీమ్ ని కృనాల్ పాండ్యా నడిపిస్తున్నాడు. ఇక కృనాల్ నాయకత్వంలో లక్నో జట్టు ఆడిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో కృనాల్ సేన 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. మరి ఇవాళ్టి మ్యాచ్ లో కృనాల్ ఏ విధంగా తన జట్టును నడిపిస్తాడో చూడాలి మరీ..

Also Read : Wrestlers Protest: రెజ్లర్లకు మద్దతుగా రైతుల నిరసన.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం..

తుది జట్ల అంచనా:
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, అల్జారీ జోసెఫ్, మహ్మద్ షమీ.
లక్నో సూపర్ జెయింట్స్: కైల్ మేయర్స్, మనన్ వోహ్రా, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా(కెప్టెన్), కృష్ణప్ప గౌతమ్, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్

Exit mobile version