NTV Telugu Site icon

Harbhajan Singh: టీ20 కోచ్‌గా ఆ మాజీ ఆటగాడు బాగా సరిపోతాడు..

Harbhajan Singh

Harbhajan Singh

Harbhajan Singh: టీమిండియా జట్టుకు ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కోచ్‌ ఉంటే బాగుంటుందని గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. దీనిని భారత మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ సమర్థించాడు. టీమిండియా టీ20 కోచ్‌గా పేస్‌ దిగ్గజం ఆశిష్‌ నెహ్రా సరిగ్గా సరిపోతాడని హర్భజన్‌ సింగ్‌ భావిస్తున్నాడు. ఎందుకంటే అతనికి ప్రస్తుత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కంటే పొట్టి ఫార్మాట్ బాగా తెలుసు అని అన్నాడు.  అదే సమయంలో ప్రస్తుత కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను తక్కువగా అంచనా వేయలేమన్నాడు. ఎంతోకాలం ద్రవిడ్‌తో పని చేసిన తనకు ద్రవిడ్‌ గురించి తెలుసని, ఆటపై అతనికున్న అవగాహన గురించి తెలుసని హర్భజన్‌ చెప్పాడు. అయితే ఇంగ్లాండ్‌ జట్టు కూడా ఇదే తరహాలో ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కోచ్‌ను నియమించుకున్న విషయం తెలిసిందే. నెహ్రా 2017లో ఆట నుంచి రిటైర్ అయ్యాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్‌ అరంగేట్రంలో టైటిల్‌కు కోచ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

“ఇటీవల ఆట ఆడిన వ్యక్తి టీ20ల్లో కోచ్ పదవికి బాగా సరిపోతాడని నేను చెప్పడం లేదు. రాహుల్‌ని టీ20 నుంచి తొలగించాలని నేను చెప్పడం లేదు. 2024 ప్రపంచకప్ కోసం ఈ జట్టును నిర్మించేందుకు ఆశిష్, రాహుల్ కలిసి పని చేయవచ్చు” అని హర్భజన్ అన్నాడు. టీ20లు కాస్త భిన్నమైనవని.. ఈ ఫార్మాట్‌లో అద్భుతంగా రాణించిన ఆశిష్‌ లాంటి వారైతే 2024లో ప్రపంచకప్‌కు జట్టును మరింత మెరుగ్గా సన్నద్ధం చేయవచ్చని హర్భజన్‌ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్ సిరీస్‌ సమయంలో ద్రవిడ్‌ విశ్రాంతి తీసుకున్నాడు. అలాంటప్పుడు మరో కోచ్‌ ఉంటే ఆ బాధ్యతలను చూసుకుంటాడు. ఫార్మాట్‌ను బట్టి ఆటగాళ్లను మార్చాలని హర్భజన్‌ అన్నాడు.

FIFA World Cup 2022: ఒక్కటే గోల్‌.. కామెరూన్‌పై స్విట్జర్లాండ్ విజయం

T20 ఫార్మాట్‌లో విధానం మారాలని.. మొదటి ఆరు ఓవర్లు ముఖ్యమైనవనన్నారు. ప్రస్తుతం టాప్‌ ఆర్డర్‌ రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లో ఔటైతే.. సూర్యకుమార్‌, హార్దిక్‌ పాండ్యాల మీద ఆశలు పెట్టుకోవాల్సి వస్తుందన్నారు. వారు కూడా రాణించలేకపోతే ఇక స్కోర్‌ పూర్తి చేయకుండానే వెనుదిరగాల్సి వస్తుంది. ఈ విషయంలో ఇంగ్లాండ్‌ తన విధానం మార్చుకోవడం వల్లనే వారు రెండు ప్రపంచకప్‌లను సాధించగలిగారు. అందుకే టీ20లను టీ20ల్లాగే ఆడాలని వన్డేల్లా కాదని భజ్జీ సూచించాడు. రోహిత్ శర్మ తర్వాత టీ20ల్లో హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉండాలని హర్భజన్ పేర్కొన్నాడు.