Site icon NTV Telugu

Deepawali 2025 : NTV డిజిటల్.. సినిమా ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు

Ntv Tollywood

Ntv Tollywood

NTV వెబ్ సైట్ సినిమా ప్రేక్షకులకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు. గత ఎన్నో ఏళ్లుగా మేము అందించే వార్తలను ఫాలో అవుతూ.. మీ ఆదరణ మాకు అందిస్తూ, మాపై చూపిస్తున్న ప్రేమకు, సినీ అభిమానులైన మీ అందరికి కృతజ్ఞతలు. టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, మాలీవుడ్ తో పాటు బాలీవుడ్ మరియు హాలీవుడ్ కు చెందిన ఎన్నో సినిమా విశేషాలను అందరి కంటే ముందుగా మీకు అందిస్తోంది మా, మీ NTV వెబ్ సైట్ . భాషాభేదం లేకుండా ఫలానా హీరో అని కాకుండా అందరి హీరోలకు చెందిన సినిమా అప్డేట్స్ తో పాటు సినిమా రివ్యూలు, కలెక్షన్స్ వివరాలు, ఆ సినిమాలు తాలూకు రికార్డులు ఎప్పటికి అప్పుడు అత్యంత వేగంగా నిక్కచ్చిగా అందిస్తున్న మాపై మీ చుపిసున్న ఆదరాభిమానాలతో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం.

అందరి హీరోలు, హీరోయిన్స్ అభిమానుల మద్దతుతో సినిమా విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాం. మా వెబ్ సైట్ పట్ల ఇంతటి ప్రేమ చూపిస్తున్న పాఠకులకు ముఖ్యంగా సిని అభిమానులకు పేరు పేరునా ధన్యవాదములు. ఈ దీపావళి రోజు మీ జీవితంలో  చీకటిని తొలగించి నూతన  వెలుగులు నింపి, నిబద్ధతో, నిజాయితితో నలుగురికి మేలు చేసేలా మీరు చేసే పనిలో మీకు విజయం కలగాలని దీప మాలికల శోభతో మీ ఇంటిల్లిపాది ఈ దీపావళిని ఆనంద కోలాహలంతో, పిండివంటల ఘుమఘుమలతో   నూతన వస్త్రాలు ధరించి హాని కలిగించని బాణసంచా చప్పుళ్ళుతో సంబరాలు చేసుకోవాలని ఈ దివ్య దీపావళి సోయగాలు మీ అందరిపై ఉండాలని, ఉంటాయని కోరుకుంటూ మరొకసారి సినీ ప్రేక్షాభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సదా మీ ఆదరాభిమానాలతో NTV డిజిటల్ సినిమా డెస్క్.

Exit mobile version