Site icon NTV Telugu

HanuMan : మహా మాస్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి.. అంటూ సస్పెన్స్ లో పెట్టేసిన ప్రశాంత్ వర్మ..

Whatsapp Image 2023 12 26 At 8.37.46 Pm

Whatsapp Image 2023 12 26 At 8.37.46 Pm

టాలీవుడ్‌ యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా హనుమాన్‌ . తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్‌గా వస్తోన్న ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.మేకర్స్‌ ఇప్పటికే లాంఛ్ చేసిన హనుమాన్‌ టీజర్‌ నెట్టింట తెగ వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ను మేకర్స్‌ షేర్ చేశారు. రేపు ఉదయం 11:07 గంటలకు మహా మాస్ అప్‌డేట్ అందించబోతున్నట్టు మేకర్స్‌ తెలియజేశారు.రేపు అంజనాద్రి మాస్‌ మహా ప్రజెంటేషన్‌తో ప్రతిధ్వనించబోతుంది. రేపు మరింత చారిత్రాత్మకం కాబోతుంది.. ఎవరో ఊహించండి.. అంటూ సస్పెన్స్‌లో పెట్టేశాడు ప్రశాంత్‌ వర్మ. ఆ అప్‌డేట్‌ ఏంటనే దానిపై నెలకొన్న సస్పెన్స్ వీడాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే..

హనుమాన్‌ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కే నిరంజన్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ అమృతా అయ్యర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్‌, వినయ్‌ రాయ్‌, రాజ్ దీపక్‌ శెట్టి మరియు వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి గౌరా హరి-అనుదీప్ దేవ్‌, కృష్ణ సౌరభ్‌ సంయుక్తంగా మ్యూజిక్‌ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు. శ్రీమతి చైతన్య సమర్పణలో తెరకెక్కుతున్న ఈ మూవీకి అస్రిన్‌ రెడ్డి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా, వెంకట్‌ కుమార్‌ జెట్టీ లైన్‌ ప్రొడ్యూసర్‌గా మరియు కుశాల్‌ రెడ్డి అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. మానవాళి మనుగడను కాపాడేందుకు నీ రాక అనివార్యం హనుమాన్ అనే డైలాగ్స్,అదిరిపోయే బీజీఎంతో సాగుతున్న విజువల్స్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి . జాంబిరెడ్డి వంటి సూపర్ హిట్ తర్వాత తేజ సజ్జా, ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో హనుమాన్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి,

Exit mobile version