సంక్రాంతి కానుకగా చిన్న సినిమాగా విడుదల అయిన హనుమాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది.అయితే హనుమాన్ మూవీని మొదట తెలుగుతోపాటు భారతీయ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా నిర్మించాలనుకున్న ఇప్పుడు అంతర్జాతీయ భాషల్లో కూడా విడుదలై పాన్ వరల్డ్ చిత్రంగా పేరు తెచ్చుకుంది.(జనవరి 12) న శుక్రవారం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ మరియు జపనీస్ భాషల్లో హనుమాన్ చిత్రం విడుదలైంది.హనుమాన్ సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సినిమాను చూసిన ప్రేక్షకులు హనుమాన్ చిత్ర యూనిట్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్‌ను ఈ సినిమా చూసి నేర్చుకోమంటూ ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ మూవీతో సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొంది.ఈ నేపథ్యంలో హనుమాన్ ఓటీటీ హక్కులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
హనుమాన్ మూవీని ప్రముఖ ఓటీటీ జీ5 డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. ఇక మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఉండటంతో దానికి తగినట్లుగానే ఓటీటీ హక్కులు అమ్ముడుపోయినట్లు సమాచారం.హనుమాన్ సినిమాను జీ5 సంస్థ మొత్తంగా రూ. 16 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అందులో హనుమాన్ తెలుగు వెర్షన్‌కు రూ. 11 కోట్లు, హిందీ వెర్షన్‌కు రూ. 5 కోట్లు వెచ్చించినట్లు సమాచారం.దీంతో తేజ సజ్జా నటించిన నాలుగో సినిమాకు ఇంత పెద్ద స్థాయిలో ఓటీటీ హక్కులు అమ్ముడుపోవడం అతని కెరీర్‌లో అతి పెద్ద మలుపు అని చెప్పొచ్చు. అయితే హనుమాన్ ఓటీటీ విడుదలపై భిన్నాభిప్రాయాలు వెలువడనున్నాయి. ఇప్పటికైతే సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత నాలుగు వారాలకు ఓటీటీలో విడుదల చేస్తారు. కొన్నిసార్లు సినిమా టాక్ ను బట్టి మరియు కలెక్షన్స్‌ను బట్టి డేట్స్ మారుస్తుంటారు.మరికొన్ని సార్లు సినిమాను ఎప్పుడు విడుదల చేయాలనేది ఓటీటీ సంస్థల చేతుల్లో ఉంటుంది. ప్రస్తుతానికి అయితే హనుమాన్ మూవీ మార్చి నెలలో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి రెండో వారంలో హనుమాన్ ఓటీటీలోకి విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే, హనుమాన్ మూవీ మంచి థియేట్రికల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ మూవీ అని చూసిన ప్రేక్షకులు అంటున్నారు. ఓటీటీ కంటే థియేటర్‌లోనే గ్రాఫికల్ విజువల్స్ బాగా ఎంజాయ్ చేయవచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు