NTV Telugu Site icon

Hanuman : ‘హనుమాన్’ టీంపై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు.. డైరెక్టర్ పోస్ట్ వైరల్..

Prasanth Varma

Prasanth Varma

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబినేషన్ లో వచ్చిన రీసెంట్ మూవీ ‘హనుమాన్ ‘.. చిన్న సినిమాగా సంక్రాంతి రేసులో బరిలోకి దిగిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. రిలీజ్ కు ముందు థియేటర్స్ కోసం ఇబ్బంది పడ్డా, చివరకు హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది.. దాంతో ఈ సినిమా పై తప్పుడు ప్రచారాలు కూడా వస్తున్నాయి.. సినిమా టీంపై నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ నుంచి హనుమాన్ టీం గురించి ఇష్టమొచ్చినట్టు పోస్ట్ చేస్తున్నారు.

ఇకపోతే ఓ నెటిజన్ ఏకంగా ప్రశాంత్ వర్మ పేరుతోనే ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి.. చరణ్ నన్ను డిన్నర్ కి పిలిచి నాతో సినిమా చేయమని అడిగాడు, నేను నో చెప్పాను అంటూ ఫేక్ న్యూస్ పోస్ట్ చేశారు.. ఆ పోస్ట్ ఎంతగా వైరల్ అవుతుందో చూశాం.. డైరెక్టర్ పై, సినిమాపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు.. ఈ పోస్టుల పై తాజాగా చిత్ర డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్పందించాడు..

సోషల్ మీడియాలో ప్రశాంత్ వర్మ ఒక పోస్ట్ చేశాడు.. సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ తో చాలా మంది మా టీం మీద, సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. నిన్న భోగి రోజు ఇలాంటి డిజిటల్ చెత్తని మంటల్లోకి విసరడం మర్చిపోయినట్టు ఉన్నారు. ఏది ఏమైనప్పటికి ధర్మం కోసం నిలబడే వాడు ఎప్పటికైనా గెలుస్తాడు అని మా నమ్మకాన్ని నిజం చేస్తూ మా సినిమాకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. హనుమాన్ గాలిపటం ఈ సంక్రాంతికి మరింత ఎత్తుకు ఎదగడానికి సిద్ధంగా ఉంది అని పోస్ట్ చేశారు. దీంతో ప్రశాంత్ వర్మ ట్వీట్ వైరల్ అవ్వగా నెటిజన్లు ఆయనకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు..