హనుమాన్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ ఏడాది వచ్చిన సంక్రాంతి సినిమాల్లో భారీ క్రేజ్ ను అందుకున్న సినిమాగా సరికొత్త రికార్డును అందుకుంది.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకేక్కింది.. తేజా సజ్జా హీరోగా నటించగా, అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమా చిన్న సినిమా గా విడుదలైన కూడా 350 కోట్లకు పైగా రికార్డు స్థాయి కలెక్షన్స్ ను అందుకుంది..
గతంలో తెలుగులో ఒక సినిమా 100 రోజులు, 50 రోజులు ఆడింది, ఇన్ని సెంటర్స్ లో ఆడింది అని గర్వంగా చెప్పకునే వాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు.. ఇప్పుడు ఏకంగా 200 రోజులు కూడా బాగానే ఆడుతున్నాయి.. ఇప్పుడు ఓటీటీలో వెంటనే సినిమాలు విడుదల అవుతున్నా క్రేజ్ తగ్గట్లేదు.. హనుమాన్ సినిమా కూడా జోరు తగ్గలేదని తెలుస్తుంది..
తాజాగా హనుమాన్ సినిమా సరికొత్త రికార్డు ను సొంతం చేసుకుంది.. హనుమాన్ 300 సెంటర్స్ లో 30 రోజులు ఆడి అందర్నీ ఆశ్చర్యపరిచింది.. ఆ తర్వాత సగం థియేటర్ల లో 50 రోజులు ఆడింది.. ఈరోజు తో 100 పూర్తి చేసుకున్న హనుమాన్ ఇంకా 25 సెంటర్స్ లో ఆడుతుంది. 25 సెంటర్స్ లో హనుమాన్ 100 రోజులు ఆడుతుందని స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు..ఇక హనుమాన్ సినిమా తెలుగులో జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.. ఇక ఈ సినిమా కు సీక్వెల్ జై హనుమాన్ సినిమా కూడా రాబోతుంది..