HanuMan : ఎట్టకేలకు సాలిడ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో ‘తేజ సజ్జ’ నటిస్తున్న సూపర్ హీరో మూవీ ‘హనుమాన్’. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పై ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి.హిందూ పురాణాల్లో ‘హనుమంతుడి’ పాత్రని ఆధారంగా ఈ చిత్రంలో ఇండియన్ సూపర్ హీరోగా చూపించబోతున్నారు. ఆ మధ్య ఈ మూవీ నుంచి విడుదల అయిన టీజర్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ఈ మూవీని చిత్ర యూనిట్ వచ్చే ఏడాది సంక్రాంతికి పోస్ట్‌పోన్ వేసిన విషయం తెలిసిందే.టీజర్ తో నే ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అందుకునేందుకు మూవీ టీం గ్రాఫిక్స్ విషయంలో బాగా క్వాలిటీ మెయిన్‌టైన్ చేయాలని నిర్ణయించుకుందని సమాచారం.అందుకనే బెటర్ విఎఫ్ఎక్స్ వర్క్ తో వచ్చేందుకు సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు దర్శకనిర్మాతలు తెలియజేశారు.. మూవీకి టీం ఇప్పటివరకు సినిమాకు సంబంధించి ఎటువంటి ప్రమోషన్స్ ని మొదలు పెట్టలేదు.
తాజాగా దీని గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.ఈ వినాయక చవితి నుంచి హనుమాన్ మూవీ ప్రమోషన్స్ మొదలు పెడతామంటూ ప్రశాంత వర్మ ట్వీట్ చేయడం జరిగింది.. మరి వినాయక చవితి నాడు ఏం అప్డేట్ ప్లాన్ చేశారో చూడాలి. అమృత అయ్యర్ ఈ సినిమాలో తేజ సజ్జ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. వినయ్ రాయి విలన్ పాత్ర చేస్తుంటే వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నల కిశోర్, సత్య, గెటప్ శ్రీను వంటి వారు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. నిరంజన్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. వరల్డ్ వైడ్ గా మొత్తం 11 భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది.2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీని విడుదల చేయనున్నారు మేకర్స్.. కాగా సంక్రాంతి రేసులో బడా హీరోల సినిమాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. మహేష్ బాబు ‘గుంటూరు కారం’, రవితేజ ‘ఈగల్’, ప్రభాస్ ‘కల్కి 2898 AD’ సినిమాలు ఉన్నాయి.ఇంత గట్టి పోటీ తట్టుకొని హనుమాన్ మూవీ ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.
Also Read
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
- 10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
- AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
- Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
తాజావార్తలు
-
iOS 27 Update: iOS 27 అప్డేట్ విడుదల.. ఏ iPhone మోడళ్లకు లభిస్తుంది? డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
-
RamBola Title War: ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు..‘రామ్ బోలా’ వివాదంలో హనుమాన్ అంశ్ దర్శకుడు
-
Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
-
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్‌పోన్ అవుతుందా?
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
ట్రెండింగ్
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!