టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హను-మాన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బిగ్గెస్ట్ హిట్ అయింది .విడుదల అయిన ప్రతి భాషలో ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టింది.థియేటర్ లో ఎంతగానో ఆకట్టుకున్న హను-మాన్ మూవీ ఓటిటిలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా బిగ్గెస్ట్ హిట్ అయింది.ఇదిలా ఉంటే థియేటర్,ఓటిటి లో సూపర్ హిట్ అయిన హను-మాన్ మూవీ ఇప్పుడు టీవీలోకి వచ్చేందుకు సిద్ధం అయింది .ప్రతి వారం సరికొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఈ వారం సూపర్ హిట్ పాన్ ఇండియా మూవీ హను-మాన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత నిరంజన్ రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ సినిమాను జీ తెలుగు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా అందిస్తోంది.
టాలెంటెడ్ నటీనటులు మరియు సాంకేతిక నిపుణులతో రూపొందిన ‘హను-మాన్’ చిత్రాన్ని ఆస్వాదించడానికి మీరూ సిద్ధంగా ఉండండి. బుల్లితెరపై ‘హను-మాన్’ ఆగమనం ఈ ఆదివారం (ఏప్రిల్ 28) సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో మాత్రమే అంటూ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈ పాన్ ఇండియా సూపర్ హిట్ సినిమా హనుమాన్తో పాటు జీ తెలుగు తమ ప్రేక్షకులకు మరిన్ని సర్ప్రైజ్లను అందిస్తోంది.ఈ క్రమంలో జీ తెలుగు హను-మాన్ సెల్ఫీ కాంటెస్ట్‌ను తీసుకొచ్చింది . ఇందులో భాగంగా నిర్వహిస్తున్న ఈ సెల్ఫీ కాంటెస్ట్‌లో పాల్గొని కళ్లుచెదిరే కిచెన్ ఐటెమ్స్‌ని బహుమతులుగా పొందవచ్చు. ఇందుకోసం ప్రేక్షకుల పిల్లలకి ఇష్టమైన సూపర్ హీరో గెటప్ వేసి వారితో ఒక సెల్ఫీ తీసుకుని 9966034441 నెంబర్‌కి మిస్డ్ కాల్ ఇవ్వాలి. లేదంటే టీవీ స్క్రీన్‌పైన కనిపించే QR కోడ్‌ని స్కాన్ చేసి కూడా సెల్ఫీని అప్లోడ్ చేయవచ్చు.విజేతల వివరాలను హను-మాన్ సినిమా ప్రసార సమయంలో ప్రకటించనున్నట్లుగా జీ తెలుగు తెలిపింది.
