Site icon NTV Telugu

Hansika Motwani: గోల్డెన్ షరారాలో.. ’ఇన్ ఆంఖోన్ కి మస్తీ’ చేసిన హన్సిక

Hansika Motwani

Hansika Motwani

Hansika Motwani: నటి హన్సిక మోత్వాని, తన చిన్ననాటి ఫ్రెండ్ సోహెల్​కతురియాతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆదివారం (డిసెంబర్ 4న) కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరిగింది. జైపూర్‌ సమీపంలోని ముందోటా ఫోర్ట్‌ ప్యాలెస్‌ లో జరిగిన ఈ పెళ్లికి పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. హన్సిక, సోహైల్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. హన్సిక, సోహెల్ సింధీ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు.

Read Also: Jeevitha Rajasekhar: కూతుళ్ల కోసం ఆస్తులు అమ్ముకున్నాం.. కంటతడిపెట్టిన జీవిత

ఇదిలా ఉండగా హన్సిక , సోహెల్ సూఫీ నైట్ షొటోలు ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సూఫీ నైట్ కోసం హన్సిక.. డిజైనర్ అభినవ్ మిశ్రా సెట్ చేసిన రూ. 3 లక్షల గోల్డెన్ షరారాను ధరించింది. ఆ డ్రెస్ లో హన్నిక గోల్డె్న్ బ్యూటీ గా మెరిసిపోయింది. ఇప్పుడా ఆ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో ఫోస్ట్ చేసింది హన్సిక. అంతే గోల్డెన్ షరారా సెట్లో హన్సిక లుక్ ను చూసిన అభిమానులు… అలనాటి నటి రేఖ ఫేమస్ సాంగ్ ‘ఇన్ ఆంఖోన్ కి మస్తీ’ ని గుర్తుచేసుకుంటున్నారు. గోల్డ్ షరారా సెట్ ,వెండి టిష్యూ ఆర్గాన్జాతో చేసిన దుపట్టా.. హెవీ నెక్‌పీస్ తో కనిపించిన హన్సిక గ్లామ్ లుక్‌ ఉమ్రావ్ జాన్ రోజులను గుర్తుచేస్తుంది.

Exit mobile version