యాపిల్ బ్యూటీ హన్సికా మోత్వానీ సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతోంది. టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హన్సికా కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంది.గతేడాది డిసెంబర్ 4న హన్సికా వివాహం ఎంతో గ్రాండ్ జరిగిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడు సోహైల్ కతూరియాను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తోంది. అయితే పెళ్లి తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ లో మరింత స్పీడ్ ను పెంచింది. చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉంది.దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత హన్సికా గతేడాది ‘మహా’ అనే తమిళ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక తాజాగా పార్ట్నర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కామెడీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పార్ట్నర్’ చిత్రంలో ఆదిపినిశెట్టి, హన్సిక ప్రధాన పాత్రలు పోషించారు. యోగిబాబు, రోబో శంకర ముఖ్యమైన పాత్రలలో నటించారు.
ఈ చిత్రానికి మనోజ్ దామోదరన్ దర్శకత్వం వహించారు. ఆయన ఈ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయం అయ్యారు.ఈరోజు ఈ సినిమా గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈసినిమా ప్రమోషన్స్ లో హన్సిక చురుకుగా పాల్గొంటోంది. సోషల్ మీడియాలో వరుస ఫొటోషూట్లతో తెగ సందడి చేస్తోంది. తాజాగా హన్సికా స్టైలిష్ లుక్ లో కనిపించింది.. అదిరిపోయేలా ఫొటోషూట్ తో ఆకట్టుకుంది..తాజాగా ఈ ఫొటోలను అభిమానులకు షేర్ చేసింది.. పార్ట్నర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇలా మెరిసినట్టు ఆమె తెలిపింది. హన్సిక స్టైలిష్ లుక్ లో కిల్లింగ్ లుక్స్ తో అదరగొట్టింది. మరోవైపు తన హాట్ గ్లామర్ తో మెస్మరైజ్ చేసింది.బ్లాక్ సూట్ ధరించి.. వైట్ టాప్ లో మెరిసింది. బ్లేజర్ ఓపెన్ చేసి నడుము అందాలతో మతి పోగొట్టింది.తన నాబి అందాలతో రెచ్చగొట్టింది.మత్తెక్కించే చూపులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. ప్రస్తుతం హన్సికా నయా లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది